ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాలన్నీ క‌లిసి ఎదురుకుంటున్న పెద్ద స‌మ‌స్యంటే ముమ్మాటికి ఉగ్ర‌వాద‌మేన‌ని చెప్పాలి. తీవ్ర వాదుల వికృత చేష్ట ప‌రకాష్ట కు చేరుకుంది. వీరి ఆగ‌డాలకు ద్దులేకుండా పోయింద‌న్న జ‌గ‌మేరిగిన సత్యం. తాజాగా పారిస్ ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడులు చేసి దాదాపుగా 128 మంది సామాన్య ప్ర‌జ‌ల‌ను  పొట్ట‌న పెట్టుకున్న చ‌ర్య ప్ర‌పంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి చెందాయి. ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ పోక‌డ‌ల‌పై ప్రాధాన్య‌తనిచ్చే జీ20 కూట‌మి కూడా అనివార్యంగా త‌న శిఖ‌రాగ్ర స‌ద‌స్సు మొద‌టి రోజంతా ఉగ్ర‌వాదంపైనే చ‌ర్చించక తప్ప‌లేదు. ట‌ర్కీ లోని అంతాల్య‌లో స‌మావేశ‌మైన జీ20 దాదాపుగా అన్ని దేశాధినేత‌లు ఉగ్ర‌వాదాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. ఉగ్ర‌వాదం శాంతికి, ఆర్థికాభివృద్ధికి తీవ్ర ఆటంకమ‌ని ఆందోళ‌న వెలిబుచ్చారు. ఉగ్ర‌వాద సంస్ధ‌లు వివిధ  దేశాల యువ‌త‌ను చేర్చుకోకుండా అడ్డుక‌ట్ట వేయాల‌ని, ఉగ్ర‌వాదం పై చ‌ర్చించ‌డానికి ఈ సందర్భంలో జీ20 త‌గిన వేదిక అనే చెప్ప‌వ‌చ్చు. ఈ కూట‌మి లో అన్ని దేశాల‌కు స‌భ్య‌త్వం లేక‌పోవ‌డం పెద్ద లోప‌మేన‌ని అన‌క త‌ప్ప‌దు. వాణిజ్య‌మే వేదికగా పుట్టిన వేదిక ఈ జీ20. 


ప్ర‌పంచ పోక‌డ‌ల‌పై చ‌ర్చిండానికి ఏర్ప‌డ‌ని ప్ర‌ధాన వేదిక‌గా జీ20


రెండ‌వ ప్ర‌పంచ‌యుద్ధానంత‌రం ఐక్య‌రాజ్య స‌మితి ఏర్ప‌డిన త‌రువాత, ప్ర‌పంచ పోక‌డ‌ల‌పై చ‌ర్చిండానికి ఏర్ప‌డ‌ని ప్ర‌ధాన వేదిక‌గా జీ20 అవ‌త‌రించింది. ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా డలిలోని శాశ్వ‌త స‌భ్య‌త్వ దేశాల‌న్నీ ఇందులో ఉన్నాయి. జీ20 వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పిన విష‌యాలు సంద‌ర్భోచితంగా ఉన్నాయి. ఉగ్ర‌వాదాన్ని మాన‌వాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద స‌వాల్ గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఉగ్ర‌వాద స్వ‌రూపం మారిపోతున్న తీరును ఎత్తి చూపుతూ.. కొన్ని దేశాలు ఒక‌ప్ప‌టి ఉగ్ర‌వాద నిర్మాణాల‌ను కొన‌సాగిస్తే త‌మ రాజ్య ధానాలుగా మార్చుకున్నాయ‌ని విమ‌ర్శించారు. ఒక‌ప్పుడు ఘ‌ర్ష‌ణ సాగుతున్న ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన ఉగ్ర‌వాదం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు తాకిన తీరును ప్ర‌ధాని మోడీ వివ‌రించారు. ప్ర‌పంచ దేశంలోని స్వేచ్ఛా స‌మాజాల‌కు ఉగ్ర‌వాదం అత్యంత ప్రమాద‌క‌ర‌ని హెచ్చ‌రించారు. ప్ర‌పంచ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌ధాని మోడీ ప్ర‌తిపాదించిన ప‌ది సూత్రాల‌ను ప్ర‌తిపాదించారు. ఇందులో ప్ర‌దాన‌మైన‌ది ఉగ్ర‌వాదాన్ని మ‌తం నుంచి వీడ‌దీసి చూడాలి అన్న‌ది. ప్ర‌ధాని మోడీ ఈ వివ‌ర‌ణ‌లో మంచి మార్పును చూడ‌వ‌చ్చు.


ఇక్కడ మ‌న‌దేశంలో మ‌తవాద శ‌క్తులు పేట్రేగి పోతూ దేశ ప్ర‌తిష్ఠ‌కు భంగ‌క‌రంగా మారాయి. దేశంలో నెల‌కొన్న విద్వేష దాడుల‌పై  ప్ర‌ధాని మోడీ ని  కేంద్రంగా చేసుకొని విమ‌ర్శ‌లు పెరిగాయి. ఈ ఘ‌ట‌న‌లు మోడీని విదేశాల‌లో కూడా ఇరుకున పెట్టాయి. ఇటువంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదురుకుంటున్న  మోడీ జీ20 వేదిక‌పై ఉగ్ర‌వాదాన్ని నిస్సంకొచంగా ఖండించారు. మ‌త విద్వేషాలు పెరిగితే ఎటువంటి మూల్యం చెల్లించాల్సివ‌స్తుందో ప్ర‌ధాని మోడీకి ఆర్ధం కావడం హర్షించ‌ద‌గ్గ విష‌య‌మే. నిజానికి ప్ర‌ధాని మోడీ జీ20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు హాజ‌రుకాడం చాలా అనుకూల సంద‌ర్భంలో సాగింది. ఇక‌పోతే.. ఉగ్ర‌వాదాన్ని మాట‌వ‌ర‌సకు ఖండించ‌డం కాదు, దాని మూలాల‌ను పెకిలించి వేయ‌డానికి చిత్త శుధ్ధిని ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌ధానం. ఉగ్ర‌వాదం పేట్రేగిపోవ‌డానికి కార‌ణం అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ వంటి  పెద్ద దేశాలు అనుస‌రిస్తున్న దురాక్ర‌మ‌ణ విధానాలే ముఖ్య‌కారణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ వాస్త‌వాన్ని జీ20 లోని పెద్ద దేశాలు ఆమోదించ‌డం లేదు. వాటి వెంట ఉన్న వ‌ర్ధ‌మాన దేశాలు సైతం చెప్ప‌డం లేదు.


జీ20 స‌ద‌స్సు జ‌రిగిన ట‌ర్కీ సిరియాకు పొరుగు దేశం. ట‌ర్కీ మొద‌లుకొని ఫ్రాన్స్ వ‌ర‌కు ప‌లు దేశాలూ సిరియా శ‌ర‌ణార్ధుల  స‌మ‌స్యను ఎదురుకుంటుంది. నాటో దేశాలు సిరియా లో త‌ల‌దూర్చ‌డం వ‌ల్ల‌నే ఈ సంక్షోభ‌మూ, శ‌ర‌ణార్థుల స‌మ‌స్య మొద‌లైంది. ఐఎస్ఐఎస్  కు తోడ్పాటు అందిస్తున్న దేశాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు. కానీ ఈ మూలాల‌ను పెకిలించివేయ‌కుండా.. పారిస్ దాడుల‌కు ప్ర‌తికారంగా ఫ్రాన్స్ సిరియాలోని ఐఎస్ స్థావ‌రాల‌పై మ‌రిన్ని దాడుల‌ను చేస్తున్నది. ఈ దాడులు, ప్ర‌తికారాల వల్ల స‌మ‌స్య మ‌రింత పెరుగుతుందే త‌ప్ప ప‌రిష్కారం సాధ్యం కాదు. అమెరికా అధ్య‌క్షుడు బార‌క్ ఒబామా, ర‌ష్యా దేశాధినేత పుతిన్ విడిగా సమావేశ‌మై సిరియా స‌మ‌స్య‌ను, ఉగ్ర‌వాద ప్ర‌మాదాన్ని గురించి చ‌ర్చించుకున్నారు. కానీ సిరియా భ‌విష్య‌త్తును అక్క‌డి ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాల‌నే అంత‌ర్జాతీయ సూత్రానికి క‌ట్టుబ‌డి ఉండ‌టానికి ఈ పెద్ద దేశాలు సిధ్ధంగా లేవు. ఇది ఇలా ఉంటే.. తాజాగా మ‌రోసారి ఐఎస్ఐఎస్ అరాచ‌క తీవ్ర‌వాదులు భారీ హెచ్చ‌రిక‌లే చేశాయి.


తాజాగా.. పారిస్ లో జ‌రిపిన భీక‌ర దాడుల నుంచి ప్ర‌పంచం ఇంకా తేరుకోక‌ముందే ఆ క్రూర మూక‌లు త‌మ త‌దుప‌రి లక్ష్యాన్ని ప్ర‌క‌టించాయి. ఈ సారి ప్ర‌పంచ అగ్ర‌రాజ్య‌మైన అమెరికాను టార్గెట్ చేశాయి. అది కూడా అమెరికా గుండె కాయ వాషింగ్ట‌న్ డీసీ పై దాడులు చేయ‌నున్న‌ట్లు తెలిపాయి. ఐఎస్ఐఎస్ తీవ్ర‌వాదులు పాగా వేసిన సిరియా పై ప‌లు దేశాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. సిరియా పై దాడి చేసే ఏ దేశాన్ని విడిచిపెట్ట‌బోమని.. వాషింగ్ట‌న్- రోమ్ ల‌లో వైమానిక దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. తాజాగా మ‌రోసారి ఐఎస్ ఐఎస్ అరాచ‌క తీవ్ర‌వాదులు ఫ్రాన్స్ లో జ‌రిపిన ఐఎస్ ఐఎస్ అరాచక తీవ్రవాదులు ఫ్రాన్స్ లో జరిపిన భీకర దాడుల నుంచి ప్రపంచం ఇంకా తేరుకోకముందే ఆ క్రూర మూకలు తమ తదుపరి లక్ష్యాన్ని ప్రకటించాయి. ఈ సారి ప్రపంచ పెద్దన్న అమెరికాను హెచ్చరించాయి. అదికూడా అమెరికా గుండెకాయ వాషింగ్టన్ డీసీ పై దాడులు చేయనున్నట్లు చెప్పాయి. 


ఈ మేరకు ఫ్రాన్స్ లో కంటే భీకర దాడులు చేస్తామని వీడియోను ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశాయి. అంటే ఉగ్ర‌వాద ప్ర‌తికార దాడులు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు ఆగ‌డంలేదు. దీనిని బ‌ట్టి చూస్తే దాడులు ప్ర‌తిదాడులు చేయ‌డం వ‌ల్ల ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌లేమ‌ని తెలిసిపోతుంది. ఉగ్ర‌వాదం పై కాకుండా వాటి మూల‌ల‌పై దాడులేకాకుండా శాస్వ‌త ప‌రిష్కార దిశ‌గా అడుగులు పడితే గానీ ఈ ఉగ్ర‌దాడుల‌ను ఆప‌డం సాధ్యం కాదు. ఐఎస్ఐఎస్ కు తోడ్పాటు అందిస్తున్న దేశాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు. కానీ ఈ మూలాల‌ను పెకిలించ‌కుండానే.. పారిస్ దాడుల‌కు ప్ర‌తీకారంగా ఫ్రాన్స్ సిరియా లోని ఐఎస్ స్థావ‌రాల‌పై మ‌రిన్ని దాడుల‌ను చేస్తున్న‌ది. ఈ దాడులు, ప్ర‌తికారాల వ‌ల్ల స‌మస్య మ‌రింత పెరుగుతుందే త‌ప్ప‌.. ప‌రిష్కారం సాధ్యం కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: