పారిస్ లో నరమేథం సృష్టించిన నర హంతకుడు అబ్దల్ అమీద్ అబౌద్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు.  పారిస్ దాడి అనంతరం ఉగ్ర వాదుల కోసం పోలీసుల వేట ముమ్మరం చేశారు.  పారిస్ లో బాంబు దాడులు చేసిన ఐసిస్ ఉగ్రవాదులకు సహకరించిన వారి కోసం గాలిస్తున్నట్టు ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కెజెన్యూ తెలిపారు. బెల్జియం జాతీయుడు ఈ దాడుల సూత్రధారి అని తెలిపారు.  ఇప్పటికే జీహాదీలకు సహకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతడి నుంచి మూడు ఏకే రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారని వివరించారు.  


ఫ్రాన్స్ పై ఉగ్రవాద కార్యకలాపానికి ముఖ్య సూత్రిదారి అబ్దుల్ హమీద్ గా ఫ్రాన్స్ ప్రభుత్వం గుర్తించింది.  ప్యారిస్ వీదుల్లో మారణకాండ సృష్టించి 120 మందికి పైగా పోటనపెట్టుకున్న ఐస్ ఉగ్రవాద కుట్రదారుడిని అగ్రదేశాలు ఎట్టకేలకు కనిపెట్టాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దురు పోలీసులు మృతి చెందగా మరో ఇద్దురు పోలీసులు గాయపడ్డారు.


పారిస్ ఎటాక్ లో బీభత్సం


కాగా పారిస్ పోలీసులు సెయింట్ డెవిస్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టి కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారిలో  అపార్ట్ మెంట్లో పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ ను కాల్చి హతమైనట్లు మరో మహిళా ఉగ్రవాది తనను తాను కాల్చుకున్నట్టు పారిస్ పోలీసులు తెలుపుతున్నారు. దిలా ఉండగా సెయింట్ డెవిస్ ప్రాంతంలో పోలీసులు  హై అలర్ట్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: