ఈ మద్య కాలంలో దేశంలో పబ్ కల్చర్,రేవ్ పార్టీలతో యువతీ యువకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  యువత బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి కొందరు బడా బాబులు ఇలాంటి దందాలు ఇల్లీగల్ గా నడుపుతున్నారు. రోజు రోజుకి దేశంలో అసాంఘిక కార్యాకలాపాలు పెచ్చు మీరుతున్నాయి. ఈ మద్య కాలంలో యువతులు సైతం మద్యం మత్తులో రోడ్లుపై చిందులేసిన వార్తలు చాలా వచ్చాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జంషెడ్‌పూర్‌లో ఓ యువతి స్థానిక హోటల్‌లో పీకలదాకా మద్యం తాగి హోటల్ సెక్యూరిటీని చితక బాదింది. పక్కనే ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.


అయితే మద్యం సేవించిన తర్వాత బ్యాక్ గెట్ నుంచి వెళ్లాల్సి ఉన్నా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో ఫ్రంట్ గేట్ నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి సెక్యూరిటీ ఆమెను వారించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ అమ్మడు శివాలెత్తిపోయింది..తనను అపుతారా అంటూ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసింది. నోటికి వచ్చినట్టు తిడుతూ, కాళ్లతో తన్నుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తించింది. పక్కనే బాయ్‌ఫ్రెండ్ కూడా ఉండడంతో మరింత రెచ్చిపోయింది.


దాంతో చుట్టు పక్కల వాళ్లు ఎంత వారించినా వాళ్లను కూడా తిట్టడం మొదలు పెట్టింది. ఇదంగా అక్కడి సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది. ఏది ఏమైనా మహిళలు రక్షణ కావాలని ఒకవైపు ఉద్యమాలు చేస్తుంటే ఇలాంటి వారి వల్ల తలదించుకునే పరిస్థితి రావడం శోచనీయం అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: