తెలంగాణ ముఖ్యమంత్రితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పోరాటం పీక్ స్టేజ్ కు చేరుకుంటున్నట్టున్నది. ఒక మీడియా అధిపతి ఏ రేంజ్ లో పోరాడగలడో అదంతా చేస్తున్నాడు రాధాకృష్ణ. తెలంగాణ సర్కారుతో ముఖాముఖి పోరాడుతున్న రాధాకృష్ణ ఆ పరంపర కొనసాగించేందుకే డిసైడయ్యారు. ఇప్పటికే ఏబీఎన్ ఛానెల్ విషయంలో ఆయన ఎన్నో పోరాటాలు చేసి నైతిక విజయం సాధించారు. 

తెలంగాణలో మీడియా దాదాపుగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందంటే అతిశయోక్తి కాదేమో. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు అనే తేడా లేకుండా ఏవీ కేసీఆర్ వ్యతిరేక వార్తలు రాసే సాహసం చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే నిర్భయంగా సర్కారులోపాలు ఎత్తి చూపుతోంది. అంతవరకూ రాధాకృష్ణ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. 

నిజాన్ని నిర్భయంగా చూపించే రాధాకృష్ణ ధైర్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే ఆ ధైర్యానికి పక్షపాతం తోడవడంతో ఆయనకు మద్దతు పెరగడం లేదు. కేసీఆర్ ను ప్రతి విషయంలోనూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపించడంతో అది వ్యక్తిగత పోరాటంగా కనిపిస్తోంది తప్పితే ప్రజాప్రయోజనం కోసం పోరాడుతున్నట్టు కనిపించడం లేదు. మొన్నటి వరకూ కేసీఆర్- సీబీఐ వార్తలు సీరియల్ గా ప్రచురించారు రాధాకృష్ణ.

వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఫ్యామిలీ గత ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపించిందంటూ వరుస కథనాలు ప్రచురించారు. ఈ విషయంపై ఎంపీ కవిత కాస్త ఘాటుగానే స్పందించారు. లేటెస్టుగా రాధాకృష్ణ కేసీఆర్ వంద అబద్దాలు పేరుతో యూట్యూబ్ లో కేసీఆర్ ను ఏకేస్తున్నారు.

 వివిధ సందర్భాల్లో కేసీఆర్ చెప్పిన మాటలను వంద అబద్దాలుగా వర్గీకరించి ఏబీఎన్ యూ ట్యూబ్ ఛానెళ్లో పెడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న డైలాగ్ తో ఈ వంద అబద్దాల సీరిస్ మొదలుపెట్టారు. భవిష్యత్ సంగతి ఏమోకానీ ప్రస్తుతానికి రాధాకృష్ణ కేసీఆర్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నట్టే కనిపిస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: