వరంగల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఆంధ్రజ్యోతి పత్రికకూ భలే పొలిటికల్ వార్ జరిగింది. కేసీఆర్, కవిత, హరీశ్ రావు ఎన్నికల సమయంలో తప్పుడు లెక్కలు చూపారంటూ వరుసకథనాలు ప్రచురించింది. దీనిపై కవిత ఘాటుగా స్పందించారు. ఆంధ్రజ్యోతి అర్థం పర్థం లేని, నిరాధారమైన కథనాలు రాస్తున్నదని..  అది చంద్రబాబు కరపత్రం అని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు తెలంగాణకు సాయం చేయడం లేదని ఇటీవల కవిత కేంద్రంపైనా చిర్రుబుర్రులాడుతోంది. 

అయితే కవిత తీరుపై టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందింస్తున్నారు. కేసీఆర్ కుటుబాన్ని విమర్శించడంలో తన మార్కు చూపించే ఆ పార్టీ అదికార ప్రతినిది నన్నూరి నరిసిరెడ్డి కవితను సినీనటులతో పోల్చి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. కవిత సినిమాలలో గయ్యాళీ పాత్రలు వేసే చాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి తక్కువ అంటూ సెటైర్ వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుపై ఆమె స్పందించిన తీరు గయ్యాళి తనంగా ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రజ్యోతి తన తప్పును బయటపెడితే తప్పుదిద్దుకోవాల్సిందిపోయి... టీడీపీ వారిపై ఎందుకు రాయడంలేదని దబాయించడమేంటని నన్నూరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆమెలా దొంగ లెక్కలు రాయదని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు మరో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా కవితపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీకి కేంద్రం ఏదో దోచి పెడుతున్నట్లు కవిత మాట్లాడడం సరికాదని కామెంట్ చేశారు. 

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు రావడం లేదని తాము బాధపడుతుంటే.. ఇలాంటి విమర్శలు చేయడమేంటన్నారు గాలి. ఆంద్రపై అక్కసు వెళ్లగక్కేలా కవిత మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఆంధ్ర పేరు చెప్పకుండా కవిత బతకలేరా అంటూ సెటైర్లేశారు. కేంద్రంలో మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న కవిత.. అది దక్కలేదనే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని కౌంటర్ వేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: