ఉదయం 12.00

వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తూ దూసుకెళ్తోంది.  తెరాస సుమారుగా 3.42 లక్షల మెజారిటీతో అద్భుతాలను నమోదు చేయబోతోంది.  ఇదంతా కేసీఆర్ సంక్షేమ పథకాలకు లభించిన ఆదరణే అని గెలవబోతున్న తెరాస అభ్యర్థి దయాకర్ అంటున్నారు. తెరాసకు 4.56 లక్షలు, కాంగ్రెసుకు 1.14లక్షలు,  భాజపాకు 78 వేలు ఓట్లు లభించాయి.

ఉదయం 9.30

వరంగల్ ఉపఎన్నికలో తెరాసఅభ్యర్థి పసునూరి దయాకర్ కు దాదాపు 65 వేల మెజారిటీ లభిస్తోంది. 

ఉదయం 8.50

ఒకటో రౌండ్ ముగిసే సమయానికి పార్టీలకు లభించిన ఓట్లు ఇలా ఉన్నయి.

తెరాస 4656 ,  కాంగ్రెస్ 1619 ,  బీజేపీ 552 ఓట్లు లభించాయి. ఇవన్నీ వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంటులో లభించిన ఓట్లు.. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు వివరాలు రాలేదు.

మంగళవారం ఉదయం 8.25 గంటలు : 

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ లో తెరాస ఆధిక్యం కనబరుస్తోంది. ఎనుమాముల మార్కెట్ యార్డు లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉత్కంఠభరితమైన వాతావరణం మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్ ముగిసే సమయానికి తెరాస అభ్యర్థి కే మెజారిటీ ఓట్లు లభించాయి. 


ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ముందు పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. మొత్తం 582 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకోగా, నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ నాలుగు ఓట్లు కూడా..  కాంగ్రెసుకు లభించడం విశేషం. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నూరు  శాతం స్కోరు చేసి.. కాంగ్రెసు పార్టీ బోణీ చేసింది గానీ.. తొలి రౌండు లెక్కింపు పూర్తయ్యే సరికి.. తెరాసకు ఆధిక్యం దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: