పరువు పోగొట్టుకోవాలనే జగన్ డిసైడయ్యారన్న మాట అనే శీర్షికతో ఈనెల 6న ఏపీ హెరాల్డ్ రాసిన కథనం అక్షరాలా నిజమైంది.  వరంగల్ ఉపఎన్నికల్లో నాలుగు రోజులు ప్రచారం చేయాలన్న జగన్ నిర్ణయాన్ని విశ్లేషిస్తూ.. అక్కడ గెలుపు అవకాశాలు లేకపోగా.. గౌరవప్రదమైన స్థానం కూడా రాదని ఏపీ హెరాల్డ్ రాసింది. ఇప్పుడు అదే నిజమైంది. జగన్ స్వయంగా ప్రచారానికి దిగినా చివరకు జగన్ కు ఘోర అవమానమే మిగిలింది. 

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ ఓటమి కూడా కాస్త గౌరప్రదంగా ఉండాలి. అప్పుడే ఆ రాజకీయ పార్టీకి కాస్త మర్యాద ఉంటుందిం. కానీ వరంగల్ ఉపఎన్నికలో ఆ అవకాశం జగన్ కు ఓటరు ఇవ్వలేదు. ఇక్కడ డిపాజిట్ ఏపార్టీకీ దక్కలేదు.. ఇక జగన్ పార్టీకి రెండు, ముడు స్థానాలు కాదు కదా.. కనీసం నాలుగో స్థానం కూడా దక్కలేదు. మొత్తం 10 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ ఎంపీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు 23,352 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఐతే.. జగన్ కు అవమానం ఎదురైంది కేసీఆర్ చేతిలోనో.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల చేతిలోనో కాదండోయి.. ఓ అనామక పార్టీ చేతిలో. శ్రమజీవి అనే ఓ పార్టీ చేతిలో జగన్ కు ఘోర అవమానం జరిగింది. ఎలాగంటారా.. సదరు శ్రమ జీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్ కు వైసీపీ కంటే ఎక్కువగా 28వేల 500 వరకూ ఓట్లు వచ్చాయి. అంటే ముక్కూ మొహం తెలియని శ్రమ జీవి పార్టీ అభ్యర్థికి కూడా జగన్ పార్టీ అభ్యర్థి కంటే ఐదు వేలు ఓట్లు వచ్చాయన్నమాట. 

ఇప్పుడు జగన్ పార్టీ పుణ్యమా అని సదరు శ్రమజీవి పార్టీ పేరు హైలెట్ అవుతోంది. జగన్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా అంతా చెప్పుకుంటున్నారు. ఈ శ్రమ జీవి జగన్ కే కాదు.. శ్రామిక జనం తరపున పోరాడే పార్టీల మని చెప్పుకునే వామపక్షాల అభ్యర్థి కంటే కూడా ఎక్కువ ఓట్లు సంపాదించారు. వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్ కుమార్‌కు కేవలం 14788 ఓట్లే వచ్చాయి. అంటే మొత్తానికి శ్రమ జీవి శ్రమ ఫలించిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: