తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ మళ్లీ ప్రాణాలు బలికొంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పై ఎంతో మంది సెలబ్రెటీల తనయులు మృత్యువాత పడ్డారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు..విధి రాత కావచ్చు ప్రమాదాల్లో ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి.  కోకాపేట వద్దనున్న ఓఆర్‌ఆర్‌పై పాలవ్యాన్‌- స్కోడా కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు జ్ఞానదేవ్ (కూతురు కొడుకు)మృతి చెందాడు. ఈయనతోపాటు కారులోవున్న వరుణ్‌, పవన్ అనే యువకులు అక్కడికక్కడే చనిపోయారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ దుర్మరణం పాలయ్యారు.బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట వద్ద స్కోడా కారు ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్‌ను వేగంగా దూసుకువచ్చిన ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్కోడా కారులో వరుణ్‌పవార్, మరో నలుగురు కలసి గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. వరుణ్ పవార్ పేర్వారం రాములు కుమార్తె కొడుకు.

పాల ట్యాంకర్ ను ఢీకొన్న కారు


కోకాపేట సమీపంలో వేగంగా వెళ్తున్న వారి కారు ముందుగా వెళ్తున్న పాల వ్యాన్‌ను ఢీకొట్టింది.  అతి వేగం అనర్ధాలకు దారితీసిందా అని అనుకుంటున్నారు కొందరు. మృతుడు జ్ఞానదేవ్ భాస్కర మెడికల్ కాలేజీ థర్డ్ ఇయర్ విద్యార్థి. ఇక సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: