భారత దేశంలో రాజకీయల్లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సహజం..ఈ మద్య రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అంటూ సవాల్ విసరడం జరిగాయి. మరోవైపు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

రాహుల్ గాంధీ తనకు ఉన్న బ్రిటన్ పౌరసత్వాన్ని దాచి పెట్టి, భారత్ లో ఎన్నికలలో పోటి చేసి ఎన్నికల ప్రక్రియను ఆపహాస్యం చేశారని ఆయన ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి రాహుల్ గాంధీ ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ఆయన వాదన. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పౌరసత్వ వివాదంపై అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

సుప్రీం కోర్టు


రాహుల్ తనకు తాను బ్రిటిష్ పౌరుడినని అక్కడి లా అధికారుల వద్ద స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని, కనుక ఆయనపై కేసు నమోదుకు సీబీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది.మంగళవారం పిల్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: