చిత్తూరు మేయర్ కఠారి అనురాధ ఆమె భర్త మోహన్ దారుణ హత్యకు గురైన విషయం పెను సంచలనం రేకెత్తించింది. బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మేయర్‌ను చంపింది మోహన్ మేనల్లుడు చింటూ అని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది.

ఎనిమిది నెలలుగా మేయర్ దంపతులు.. చింటూ మధ్య నెలకొన్న ఆర్థికపరమైన గొడవలే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఆ కోణంలోంచి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు చివరకు చింటూనే ప్రధమ నింధితుడిగా నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో  ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చింటూ తండ్రి మృతి చెందారు.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య పదకొండని జిల్లా ఎస్పీ తెలిపారు.

కాగా మరో నిందితుడు మురుగ కూడా టూ టౌన్ పీఎస్ లో లొంగిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు.  అయితే మురుగ 47వ డివిజన్ పద్మావతి భర్త అని రాజకీయంగా అనురాధకు విరోదం ఉండేదని అనురాధను చంపడానికి స్కెచ్ వేయడంలో మురగదే కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు.  ఇక కాల్పుల సంఘనలో పాల్గొంది  చింటూ, వెంకటా చలపతి అని.. ప్రధాన నిందితుడు చింటూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని..హత్యల వెనుక రాజకీయ కోణంపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: