ఆయన ఒక ఆద్యాత్మిక గురువు..వేల మందికి మార్గనిర్ధేశం చేసేవారు..మనసా వాచా అలాంటి వ్యక్తిని చాలా మంది గురువుగా నమ్ముతారు. కానీ అలాంటి వ్యక్తి కామవాంచతో ఒక బాలికను చెరపట్టారని తెలిసి..యావత్ భార దేశం తలదించుకుంది..మరి ఆ గురువు ఎవరా అనుకుంటున్నారా..? ఆయనే ఆశారాం బాపు.  బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదాస్పద గురు ఆశారాం బాపు ఆ మద్య హాట్ టాపిక్ గా మారారు. ఒక పక్క అవతార పురుషుడుగా పూజలందుకుంటూ.. మరో పక్క అశ్లీలపురుషుడుగా తిరస్కారాలను ఎదుర్కొంటూ చివరకు అత్యాచారం కేసులో జైలుకు కూడా వెళ్లాల్సివచ్చింది.

ఈయన బాటలోనే తనయుడు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొని జైలుపాలయ్యాడు. తాజాగా మామ, భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. రాజస్థాన్ లోని ఖాజురాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ 19నే ఆశారాం కోడలు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు స్టేషన్ కు పిలిచారు.  ఈ సందర్భంగా ఆమె తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, చెడుగా ప్రవర్తించేవాడని ఓ యువతిని గర్భవతిని కూడా చేశాడని చెప్పింది.  

పోలీస్ కస్టడీలో ఆశారాం బాబు


తన మాటలు పట్టించుకోకుండా ఆమెతో సంబంధాన్ని పెట్టుకొని తనను చీకట్లో మగ్గేలా చేశాడని అన్నారు.  తన మామ కూడా వేధించాడని, తన తండ్రి దేవరాజ్ కృష్ణానిని మాటలతో మభ్యపెట్టి ఆస్తులు మొత్తం తన ఆశ్రమానికి రాయించుకున్నాడని చెప్పింది. తనను నారాయణ్ మే 22, 1997న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులకు తమ పెళ్లినాటి ఫొటోలు, వీడియోలు, ఇతర పత్రాలు పోలీసులకు సమర్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: