తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల రాష్ట్రాభివృద్ది కోసం అహర్శిశలు శ్రమిస్తున్నారు. ఇక పోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి ముఖ్యమంత్రులుగా ఆయా రాష్ట్రాల్లో తమ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మద్య ఇద్దరు ముఖ్యమంత్రులకు బాగా బెడిసి కొట్టింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు..తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయం, సెక్షన్ 8 లాంటి అనేక అంశాలతో పెద్ద దుమారం చెలరేగింది. రెండు మూడు నెలల తర్వాత ఈ గొడవల్లో కేంద్రం తలదూర్చి సర్దుబాటు చేసింది. ఇక చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

దసరా పండుగ పురస్కరించుకొని రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. కేసీఆర్ కూడా సగర్వంగా వెళ్లి చంద్రబాబు పరిపాలన గురించి  గొప్పగా చెప్పారు. రాజధాని అమరావతి కోసం తమ రాష్ట్రం ఏం చేయడానికైనా సిద్దంగా ఉందని చెప్పారు. ఈ రకమైన స్నేహభావం ఇద్దరు ముఖ్యమంత్రులకు రావడంతో మోడీ కూడా సంతోషించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ నెలలో చండీయాగం చేయతలచారు. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానిస్తారా లేదా అన్న ప్రశ్న గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రదాని మోడితో కేసీఆర్, చంద్రబాబు


ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు అనుకుంటుంటే.. అది వ్యక్తిగత హోమం కాబట్టి పిలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మరికొందరూ అనుకున్నారు. అయితే ఈ సందేహాలన్నింటికి కేసీఆర్ బ్రేక్ వేశారు. తను డిసెంబర్ నెలలో నిర్వహించే చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానిస్తానని చెప్పారు. తన సొంత ఖర్చుతోనే యాగం నిర్వహిస్తున్నానని.. యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందంటూ విమర్శలు చేయడం తగదని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: