గ్లామర్ రంగంలో అక్రమ సంబంధాలు, సెక్స్ ఎఫైర్లు కామనైపోయాయి. ఇలాంటి ఎఫైర్లు ఇద్దరికీ ఆమోద యోగ్యంగా సాగిపోయినంతవరకూ బాగానే ఉంటుంది. కానీ తేడా వస్తే కానీ అసలు విషయం బయటపడదు. హిందీ సీరియల్ నటుడు యష్ పండిట్ సంగతి అలాగే అయ్యింది. ఈయన క్యోంకీ సాస్ భీ బహు థీతో పాటు పలు సీరియళ్లలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఓ రేప్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. 

యష్ పండిట్ పై రేప్ కేసు పెట్టిన అమ్మాయిం ఎవరో కాదు. ఆమె కూడా ఓ బుల్లి తెర నటే. 28 ఏళ్ల ఈ బాధితురాలు.. యష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శీలం దోచుకున్నాడని కేసు పెట్టింది. కెరీర్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామంటూ తనను యష్ వంచించాడని ఆ అమ్మాయి ఆరోపిస్తోంది. యష్ ముంబైలోని జూహూ ప్రాంతంలోని తన నివాసంలో అనేక సార్లు తనతో సెక్స్ చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తాను కూడా పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతోనే అతనికి సర్వస్వం అర్పించానని ఆ అమ్మాయి చెబుతోంది. కానీ చాలాసార్లు సెక్స్ జరిపిన తర్వాత.. ఇప్పుడు యష్ వైఖరిలో మార్పు వచ్చిందని తనను తప్పించుకుని తిరుగుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. యష్ ఇలా తననే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడట. ఈ సంగతి కూడా యష్ పండిటే తనకు చెప్పాడట. 

కానీ అలాంటి అమ్మాయిలంతా పరువు కోసం యష్ చేతిలో మోసపోయినా బయటకు రావడం లేదని.. కానీ అలాంటి నీచుడికి గుణపాఠం చెప్పేందుకే తాను ముందుకొచ్చానని ఆ టీవీ నటి చెబుతోంది. అంతేకాదు. పోలీసులు కూడా యష్ తో కుమ్మక్కైనట్టు అనుమానం వస్తోందని చెబుతోంది. అందుకే యష్ ను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్సిస్తున్నారంటోంది. పోలీసుల కథనం ప్రకారం.. యష్ పండిట్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబై సెషన్స్ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: