వరంగల్ ఉపఎన్నిక ముగిసింది. అక్కడ టీడీపీ-బీజేపీ అభ్యర్థి దేవయ్య తుక్కు తుక్కుగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. సెకండ్ ప్లేస్ కూడా సాధంచలేకపోయారు. సాధారణంగా ఇలాంటి ఘోర పరాజయం తర్వాత మీడియా ముందుకు రావడం కొంచెం ఇబ్బంది కలిగించేదే. అయినా తప్పదు కదా. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు రాక తప్పలేదు. 

ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. ఎక్కడ లోపం జరిగిందో విశ్లేషించుకుంటాం.. ప్రజాసమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం.. సహజంగా ఓడిపోయి వారి నోట ఇలాంటి డైలాగులు చాలా కామన్ గా వస్తాయి. ప్రెస్ మీట్ కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలో ముగిసిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి రూటే సెపరేటు కదా.. ఆయన ఎప్పటిలాగానే ప్రెస్ మీట్లో కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై దాడి మొదలు పెట్టారు. 

నీ ఎన్నికల హామీలు ఏమయ్యాయి.. ప్రతిపక్షాలను తిట్టించినప్పుడు నీకు బాధ తెలియలేదా.. నిన్నుగిచ్చితేనే నొప్పి తెలిసిందా.. తెలంగాణ ప్రజలు నీ అంత చూస్తారు. వైసీపీకి పట్టిన గతే నీకు పడుతుంది.. అంటూ రొటీన్ డైలాగులు చెప్పడం మొదలెట్టారు. జనం అవన్నీ ఆలోచించుకునే వరంగల్ ఉప ఎన్నిక తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయి కూడా రేవంత్ స్వరం పెంచడం ఆశ్చర్యం కలిగించింది. 

అసలు ఆ ప్రెస్ మీట్ చూస్తే.. ఎన్నికల్లో గెలిచింది టీడీపీ - బీజేపీ అభ్యర్థా.. టీఆర్ఎస్ అభ్యర్థా అని అనుమానం కలుగక మానదు. కేసీఆర్.. నిన్ను విడిచిపెట్టను.. నువ్వు ఎలా ప్రవర్తిస్తే..మేం అలాగే ప్రవర్తిస్తాం.. నువ్వు ఫుట్ బాల్ ఆడితే నేనూ ఆడతా.. టీడీపీ వర్సెస్ కేసీఆర్ ఇక ముందు కూడా కొనసాగుతుంది.. వంటి రెచ్చగొట్టే మాటలు మాత్రం రేవంత్ ఇప్పుడు కూడా వదలిపెట్టలేదు.

జనం తీర్పును కూడా గౌరవించని రీతిలో రేవంత్ మాట్లాడటం టీడీపీ నేతలను కూడా కలవర పరుస్తోంది. రేవంత్ తీరు ఇలాగే కొనసాగితే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండాపోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పరాజయంతోనూ గుణపాఠం నేర్వకపోవడం విచిత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: