వరదలతో చాలా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లో అతలాకుతలం గా మారాయి. తక్షణ వరదసాయం వెయ్యి కోట్లు కేటాయించాలి అని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హాన్స్ ఇండియా ఏపీ కి కేంద్ర ప్రభుత్వం ఏపీ కి వరదసాయం అందించింది అని దాదాపు వెయ్యి ముప్పై కోట్ల సాయం ఇచ్చింది అంటూ వార్త ప్రచురించింది.

                                                       

 

 

వరదలతో దారుణమైన పరిస్థితి ఎదురుకొంటున్న  నెల్లూరు, చిత్తూరు, కడప తదితర జిల్లాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయల సాయం ఇవ్వాలి అని బాబు రాసిన లేఖకి కేంద్రం ఎలా స్పందించింది అనే దాని మీద ఒక్కొక్క మీడియా వర్గం ఒక్కొక్కలాగా రాస్తున్నారు. ఆంధ్ర జ్యోతి అనే ప్రముఖ దిన పత్రిక కేంద్రం సాయం మీద ఒక ప్రత్యేక కథనం రాస్తూ అందులో బాబు రాసిన లేఖ మీద కేంద్రం స్పందించను కూడా స్పందించలేదు అని రాసుకొచ్చింది. సాయం అంది ఉంటె తెలుగు మీడియా సైలెంట్ గా ఎందుకు ఉంటుంది అనేది మరొక ప్రశ్న.

 

 

 

వెంకయ్య నాయుడు చెప్పిన దాన్ని కూడా తెలుగు పత్రికలూ ప్రచురించాయి  కేంద్ర అధికారుల బృందం వరద నష్టంపై అంచనా వేసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం కూడా సవివరమైన నివేదకని ఇచ్చిన తరవాత సాయం చేస్తాం అని కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పిన విషయం కూడా ఈ పత్రికలూ రాసాయి. ఈయన ఈ మాట చెప్పిన తదుపరి రోజే ఆంగ్ల పత్రిక ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

 

 

 

 హూద్ హూద్ తుఫాను సమయంలోనే నాలుగొందల కోట్లు ఇచ్చి సైలెంట్ గా ఊరుకుంది కేంద్రం, తరవాత రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రముఖ ఆంగ్ల పత్రిక మాత్రం ఇంత సొమ్ము ఇచ్చారు అని చెప్పడం వింతే. వెంకయ్య నాయుడు గారి వద్ద అదివరకు హుడ్ హూద్ గురించి ప్రశ్నిస్తే మొదట 400 కోట్లు ఇచ్చి, ఆ తరువాత  738 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఏది కరెక్టో తెలియదు.  అదే సమయంలో పుండుమీద కారంలాగా వెయ్యి కోట్లు తమిళనాడు రాష్ట్రానికి కట్టబెట్టింది కేంద్రo.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: