బెజవాడ నగరం గురించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విజయవాడ లో ఇళ్ళ అద్దెలు చూసి జనాలు భయపడుతున్నారు అని. అద్దెలు ఎక్కువగా ఉండడం వల్లనే విజయవాడ అభివృద్ధి కుంటుపడుతోంది అని ఆయన కొత్త వాదన తెరమీదకి తీసుకుని వచ్చారు.

 

 

 

ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ అద్దెలు భయపెట్టే విధంగా ఉన్నాయి అని చెప్పడం సంచలనంగా మారింది. ముంబై కోల్ కతా లాంటి మహా మహా నగరాల కంటే కూడా విజయవాడ అద్దెలు భారీగా ఉండడం తనకి ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నారు. ఇప్పటి వరకూ అద్దె విషయం లో సామాన్యులు మాత్రమే తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్న ఈ తరుణంలో విషయం ముఖ్యమంత్రి వరకూ వెళ్ళింది అంటే పరిస్థితి తీవ్రత ని అర్ధం చేసుకోవచ్చు.

 

 

 

 అద్దెల విషయం లో విజయవాడ ప్రజలు దయచేసి సానుకూలంగా ఉండాలి అని నెమ్మదిగా అద్దెలు తగ్గించే లాగా అధికారులు ప్రజలని కోరాలని, అద్దెలు తగ్గితే జనాభా పెరిగి ఉపాధి అవకాశాలు కూడా అలాగే పెరుగుతాయి అని ఒకదానితో ఒకటి ఇలా సంబంధం ఉన్న అంశాలు గనక ఈ విషయం మీద ప్రజలు చర్చించుకునే లాగా అధికారులు వారిని ప్రోత్సహించాలి అని కోరారు ముఖ్య మంత్రి.  అద్దే కదా ఏముందిలే అనుకుంటాం కానీ దానివలన విజయవాడ నగరం చాలా నష్టపోతోంది అంటున్నారు ఆయన. ఒక్కసారిగా కాకపోయినా అంచెలు అంచెలుగా అద్దె వసూళ్లు తగ్గిస్తూ అడ్వాన్సుల డబ్బు కూడా కాస్త తగ్గించాలి అని కోరారు బాబు.

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: