తాజాగా బాలీవుడ్ అగ్ర‌హీరో అమీర్ ఖాన్ చేసిన సంచ‌ల‌న కామెంట్లు ఇప్పుడు దేశ రాజ‌కీయాల‌ను కుదిపేస్తూనే.. భిన్న‌ అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. దేశంలో నెల‌కొన్న అస‌హ‌న ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని, త‌న భార్య దేశం విడిచి  వెళ్లిపోదామంటున్న‌ద‌ని బాలీవుడ్ నటుడు తెలిపారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవార్డుల ఉత్సవంలో ఆయన అవార్డు వాపసీపై అడిగినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయ‌న ఎలాంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారోన‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఈ కామెంట్ తో ఆయ‌న ఇమేజ్ కు గ‌ట్టిదెబ్బె త‌గిలింద‌ని చెప్పొచ్చు. అంతేకాకుండా భార‌త‌దేశ పౌరుడిగా అయ‌నకు చెడ్డ‌పేరే తెచ్చిపెట్టాయ‌న్న  వాద‌ల‌ను గుప్పుమంటున్నాయి. ఒక పౌరుడిగా త‌న భావ‌ప్ర‌క‌టన చేసే హ‌క్కు ఉన్నా.. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్లు దేశ యొక్క పౌర‌స‌త్వం పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దేశ గొప్ప‌త‌నాన్ని  చాటేలా ఉండలే కానీ.. దిగ‌జారేలా ఉండొద్ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


అమీర్ ఖాన్ చేసిన సంచ‌ల‌న కామెంట్లు ఇప్పుడు దేశ రాజ‌కీయాల‌ను కుదిపేస్తూనే..


అయితే ఈ కామెంట్ ల‌కు పలువురు మ‌ద్ద‌తు ప‌లుక‌గా.. వివిద పార్టీలు, అయ‌న స‌హ న‌టులు తీవ్రంగా ఖండించారు.  అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌ల వెన‌కు రాజ‌కీయ కుట్ర దాగి ఉంద‌ని, దేశ‌ప్ర‌తిష్టను దిగ‌జార్చేందుకు కాంగ్రెస్ కుట్ర ప‌న్నింద‌ని అధికార పార్టీ బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నారు. ఇంత‌కు ముందు ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు దేశాన్ని విడిచి వెళ్లాల‌న్న ఆలోచ‌న ఎందుకు రాలేద‌ని బీజేపీ ఆమీర్ ను ప్ర‌శ్నించింది. అయితే ఈ వ్య‌వ‌హారం పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశభ‌క్తుడు కాద‌ని, జాతీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాలుప‌డుత‌న్నార‌ని ముద్ర‌వేసే కన్నా వాస్త‌వ ప‌రిస్థితేంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని బీజేపీని డిమాండ్ చేశారు. మ‌రోవైపు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం పుడుతున్నాయ‌ని ఆప్ నేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇక‌పోతే.. అమీర్ ఖాన్ వాస్తవాన్ని చెప్పేందుకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారా ఏచూరి అన్నారు. 


ఇది ఇలా ఉండ‌గా..అధికార బీజేపీ అనుబంధ సంస్థ‌లైన  సంఘ్ ప‌రివార్, ఆర్ఎస్ఎస్ ల‌ నియంతృత్వ పోక‌డ‌ల‌ను వ్య‌తిరేకిస్తూ గ‌తంలో ప‌లువురు ప్ర‌ముఖులు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌లు అవార్డుల‌ను వెన‌క్కు ఇచ్చారు. ఈ అవార్డుల వాప‌సీలో దేశంలో ఉన్న ప‌లువురు మేధావులు, పారిశ్రామిక వేత్త‌లు, సామాజిక ఉద్య‌మ‌కారులు ఉన్నారు. ఈ క్ర‌మంలో  అమీర్ త‌న అభిప్రాయం చెప్పాడ‌ని దీనికి పార్టీలు రాజ‌కీయం చేస్తున్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పైగా దేశం వ‌దిలి వెళదామ‌ని త‌న భార్య కిర‌ణ్ అన‌డం అంటే అది చాలా అన‌ర్థ‌దాయ‌క ప‌రిస్థితికి సంకేతాల‌ని మాత్ర‌మే చెప్పాడు. దేశంలో అభద్ర‌త పెరుగుతున్న వాస్తవాన్ని ఒప్పుకుని చ‌క్క‌దిద్దే బ‌దులు ఆయ‌న‌పై దాడి చేస్తూ  బొమ్మ‌ల‌కు మసి పూయ‌డం, త‌గ‌ల బెట్ట‌డం వంటి ప‌నులు చేసి అన‌వ‌స‌రంగా రాజకీయం చేయోద్ద‌ని ప‌లువురు మేదావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాట‌ల‌పై సంఘ్ ప‌రివార్ సంస్థ‌లు ధ్వ‌జ‌మెత్తారు. ప‌లు హిందువాద సంస్థ‌లు తీవ్ర నిర‌స‌లు చేశాయి.


అంతేకాకుండా ఆమీర్ వ్యాఖ్యల‌పై సినీ ప్ర‌ముఖులు అనుప‌మ్ ఖేర్, రాంగోపాల్ వ‌ర్మ‌, రిషిక‌పూర్, ర‌వీనా టాండ‌న్ తీవ్రంగా ఖండించారు.త‌న‌ను ఈ స్థాయికి తీసుక‌వ‌చ్చింది భార‌తదేశ‌మేన‌న్న విష‌యాన్ని అమీర్ గుర్తుంచుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా తాజాగా తాను చేసిన వ్యాఖ్యల‌పై వివ‌రణ ఇస్తూ ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. తాను దేశాన్ని ప్రేమిస్తున్న‌ట్లు దేశాన్ని విడిచివెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని వెల్ల‌డించారు. భార‌త‌దేశ న‌న్ను క‌న్ననేలగా భావిస్తున్న‌ట్లు తెలిపారు.  అయితే.. ఇంట‌ర్వ్యూ లో చెప్పిన అంశాల‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. త‌న ఇంట‌ర్వ్యూ ను పూర్తిగా చూడ‌ని  వారే కావాల‌ని త‌న మీద బుర‌ద‌జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. అంతేకాకుండా భార‌త దేశంలో తాను పుట్టినందుకు చాలా అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లుగా పేర్కొన్న అమీర్ ఖాన్.. తాను ఇక్క‌డే శాశ్వ‌తంగా ఉండ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 


అమీర్ ఖాన్ తీరు చూస్తుంటే.. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పొచ్చుకానీ.. ఎదుటి వారు త‌మ మ‌న‌సులోని మాట‌ల్ని చెప్ప‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఉంది. భార‌త్ నుంచి వెళ్లిపోవాల‌ని చెప్పిన అమీర్ ను అభిమానులు చేసిన కామెంట్ ల‌ను అమీర్ అపార్థం చేసుకున్న‌ట్లుగా ఉంది. అభిమానుల కామెంట్లను ఆపార్దం చేసుకున్నా.. ఆయ‌న చేసిన కామెంట్ల‌కు అభిమానులు చేసిన కామెంట్లు  త‌ప్పేలా అవుతుంది. ఒక‌వేళ ఆయ‌న కామెంట్ చేయాల‌నుకుంటే ఆ సంద‌ర్బంలో అంత పెద్ద మాట అన‌వ‌ల‌సిన ప‌నేముంది.  లేక‌పోతే.. మ‌న‌సులోని మాట‌లు బ‌య‌ట‌కు చెప్ప‌టం త‌ప్పు కాదు, కానీ.. మ‌న‌సులో అయితే.. క‌న్న త‌ల్లిని, పుట్టిన నేల మీద అభిమానాన్ని చూపించాల్సి ఉండేది.  క‌న్న‌తల్లి తిట్టింద‌ని.. నా త‌ల్లి నాకు న‌చ్చ‌లేద‌ని క‌న్న‌బిడ్డ వెళ్లిపోతాడా? క‌న్న త‌ల్లి లో, పుట్టిన నేల‌లో ఏదైనా తేడా ఉంటే దాన్ని  మార్చే ప్ర‌య‌త్నం చేయాలే కానీ.. నేను నా కుటుంబం తో క‌లిసి విదేశాల‌కు వెళ‌తామ‌ని చెప్ప‌డ‌మేంట‌ని, అమీర్ కు దేశం పై ఉన్న ప్రేమ ఇదేనా అన్న అనుమానాలు తావిస్తోంది.


ఇలాంటి సంద‌ర్బంలో ఆయ‌న అభిమానుల‌కు ఏలాంటి స‌మాధానం ఇస్తారు. ఆయ‌న పై పెంచుకున్న ప్రేమ‌ను అభిమానులు ఇప్పుడు ఏలాంటి స‌హ‌నానికి గురికావాలి. దేశం లో ఆయ‌నకున్న అభిమానుల‌కు తీవ్ర అసంతృప్తినే మిగిల్చార‌నంటంలో సందేహంలేదు. అంతేకాకుండా ఇక్క‌డ ఆయ‌న కామెంట్ ల‌తో దేశ పౌర స‌మాజానికే కాకుండా ఆయ‌న అభిమానుల‌ను దృష్టి లో పెట్టుకుని స్పందించాల్సి ఉండేది. ఇక పోతే ఆయ‌న కామెంట్లో పెద్ద‌తప్పులేద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నా..అమీర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న ఇమేజీ కే తీవ్ర న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అభిప్రాయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికి బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ కు ఇమేజ్ కు మాత్రం గ‌ట్టిదెబ్బె త‌గిలింద‌ని చెప్పక త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: