సినిమా నటి చెప్పింది.. ఆమె ఓ పాపులర్ ఫిగర్.. అందుకే ఆమె మాట మంత్రంగా పని చేసింది. అప్పటివరకూ అందుకు వెనుకాడిన మహిళలు కూడా ముందుకొచ్చారు. తమ వక్షోజాలు తొలగించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సినిమా నటి ఏంటి.. వక్షోజాలు తొలగించుకోమని చెప్పడమేంటి.. ఆమె చెప్పిందని వీళ్లు అందమైన వక్షోజాలు త్యాగం చేయడం ఏంటనుకుంటున్నారా.. 

అసలు విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా రొమ్ము కాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. ఆధునిక కాలంలో మహిళలను ఎక్కువగా వేధిస్తున్న వ్యాధి ఇది. ఈ రొమ్ము క్యాన్సర్ ను సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం. అలా ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాంతకమైన వ్యాధిని జయించాలంటే ఆ వ్యాధి బారిన పడిన వారు రొమ్ములను పూర్తిగా తొలగించుకోవాలి. 

కానీ మహిళలకు వక్షోజాలే ప్రధాన ఆకర్షణ. అవి లేకుండా తమ స్త్రీత్వం కోల్పోయామని వారు భావిస్తారు. కానీ ప్రాణం కంటే అవి ఎక్కువ కాదు కదా.. అయినా సరే చాలా మంది మహిళలు వక్షోజాలు తొలగించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఈ రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఒకరు. ఓ హీరోయిన్ అయి ఉండి కూడా ఆమె  ధైర్యంగా తన రొమ్ములు తొలగించుకునేందుకు ముందుకు వచ్చింది. 

అంతే కాదు. ఆ విషయాన్ని ధైర్యంగా ప్రకటించింది. తద్వారా తన వంటి క్యాన్సర్ బాధిత మహిళల్లో స్ఫూర్తి నింపింది. తనలాంటి వారు రొమ్ములు తొలగించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆమె ప్రకటన తర్వాత వక్షోజాలు తొలగించుకునే వారి సంఖ్య పెరిగింది. జోలీ ప్రకటన వారిలో స్ఫూర్తి నింపిందని.. అందుకే ఈ సంఖ్య పెరిగిందని బ్రిటన్ వైద్య నిపుణలు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: