భారత దేశంలో ఈ మద్య కాలంలో దొంగతనాలు రక రకాలు గా చేస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు దొంగలు. ఈ మద్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఇళ్లకు ఖన్నాలు వేయం తక్కువైనా చైన్ స్నాచింగ్ కి తెగబడ్డారు. ఈజీ మని కోసం అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పపడుతు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఓ దొంగ తాను చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని చూసి అడ్డంగా బుక్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే...ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపేందుకు డీఎల్ 1ఎల్ కే 9189 వాహనంలో బయలుదేరిన డ్రైవర్ ప్రదీప్ శుక్లా గోవింద్ పూరి వద్ద వాహనాన్ని దారిమళ్లించి రూ. 22 కోట్లతో పరారయ్యడు. డబ్బుతో బయలు దేరిన వ్యాన్ మద్యలో సెక్యూరిటీ గార్డ్ వినయ్ పటేల్ యూరిన్ పాస్ చేయడానికి కిందకు దిగాడు..అయితే వ్యాన్ వాహనాన్ని గోవింద్ పురి మెట్రో స్టేషన్ వద్ద ఉంచమని కోరగా పక్క వీధిలో వేచి ఉంటానని  ప్రదీప్ శుక్లా(35) తెలిపాడు. తర్వాత వినయ్ అక్కడకు వెళ్లి చూడగా వ్యాన్ తో మనోడు డబ్బుతో తుర్రుమన్నాడు.

దీంతో జరిగిన విషయాన్ని సంబంధిత బ్రాంచ్ అధికారులకు సెక్యూరిటీ గార్డ్ వినయ్ పటేల్ తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రూ.22.5 కోట్లతో పరారైన డ్రైవర్ ప్రదీప్‌ శుక్లాని పోలీసులు పట్టుకున్నారు.  దోచుకెళ్లిన నగదులో 11వేలు మినహా మొత్తం డబ్బు అలాగే ఉంది. దాచిన డబ్బంతా ఓ గొడౌన్‌లో దాచి పెట్టి తిరిగి ఆ వ్యాన్‌ను ఒక పెట్రోల్‌ బంక్‌ వద్ద వదిలి వెళ్లాడు. నిందితుడు ప్రదీప్ శుక్లాను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: