మాస్టర్ ప్లాన్ నుంచి మాస్టర్ డెవలపింగ్ వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తదుపరి దశను వీక్షించనుంది. ఇన్నాళ్లుగా మాస్టర్ ప్లాన్ పేరిట అద్భుత గ్రాఫిక్స్ చిత్రాలను ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేసిన చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ డెవలపింగ్ దశలోకి మెల్లగా అడుగుపెట్టింది. అమరావతి సీడ్ కేపిటల్‌లో మాస్టర్ డెవలపర్‌గా సేవలందించేందు కోసం మూడు సింగపూర్ దిగ్గజ కంపెనీలు గురువారం ఒక కన్సార్టియం‌గా ఏర్పడి ఏపీ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనకూడా పంపినట్లు తెలిసింది.  ఆ మూడు సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్.

 

ఈ మూడు కంపెనీలూ సింగపూర్‌లో టౌన్‌షిప్ నిర్మాణంలో పేరుమోశాయి. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు జురోంగ్, సర్పానాలు అమరావతి మాస్టర్ ప్లాన్‌ని రూపొందించి ఏపీ ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. మరోవైపున అమరావతిలో ప్రతిష్టాత్మకమైన భవనాల నిర్మాణానికి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

 

ఈ రెండు ప్రతిపాదనలూ వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఖరారవుతాయని భావిస్తున్నారు. వచ్చే జూన్ నాటికి భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని సమాచారం. 2018లోగా ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మహా భవన నిర్మాణాన్ని తను సాధించిన విజయంగా ప్రదర్శించుకుని వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆశ పెట్టుకుందని టీడీపీ వర్గాల భావన.


మరింత సమాచారం తెలుసుకోండి: