దేశంలో బోరు బావులు తవ్విన తర్వాత వాటిని పూడ్చి పెట్టాలని ఎన్ని సార్లు ప్రభుత్వాలు హెచ్చరించినా కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్న పిల్లలు అందులో పడటం జరుగుతుంది. ఒక్కోసారి రిస్క్యూటీమ్ ఎంతో శ్రమకోర్చి పిల్లల్ని రక్షించినా కొన్ని సార్లు విఫలం అవుతుంటారు.. ఇది మానవ తప్పిదం అయినా ప్రభుత్వాల వైఫలం అని అంటారు కొందరు. ఏది ఏమైనా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు బోరు వావుల్లోపడి చనిపోవడం తల్లిదండ్రులకు షాపంగా మారుతుంది.


తాజాగా జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు తాగునీటి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, 108 సిబ్బంది బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.  మెదక్ జిల్లా  పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తాగునీటికోసం బోరు వేయగా అందులో నీరు రాలేదు. బోరు బావిపై మూత వేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు.  

మంచినీటి కోసం తవ్విన బావి


శనివారం ఉదయం  రాకేశ్‌(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. పొక్లెయిన్‌తో బోరు బావికి సమాంతరంగా మరో బావి తవ్వుతున్నారు. ఇళ్ళ మధ్యే ఉండటంతో అవి దెబ్బతినకుండా జాగ్రత్తగా తవ్వాల్సి వస్తోంది. అందుకే పనులు నిదానంగా జరుగుతున్నాయి.సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.  బావిలోకి ఆక్సిజన్ ను పంపించారు.  మూడు నెలల క్రితం బాలుడి తల్లిదండ్రులు తాగునీటి కోసం ఈ బోరుబావిని తవ్వించి బావి తమ పిల్లాడికి శాపంగా మారిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: