చాలా రోజుల త‌రువాత వెంక‌య్య నోట ప్ర‌త్యేక హోదా మాట మ‌రోసారి విన‌బ‌డింది. గ‌త రెండురోజులుగా శీత‌కాలం పార్లమెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇందులో మొద‌టి రోజుగా రాజ్యాంగం పై డా. బీఆర్ అంబేద్క‌ర్ గురించి చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ  డా. ఆంబేద్క‌ర్ ఈ దేశానికి సేవ‌లు చేసిన సేవ‌లు ఎవ్వ‌రు చేయ‌లేర‌ని తెలిపారు. ఆయ‌న చేసిన సంస్క‌ర‌ణ‌లు దేశానికి ఎంతో మేలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఇక‌పోతే..ఇదే విష‌యాన్ని ప‌లువురు ఎంపీలు సైతం అంబేద్క‌ర్ దేశానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.  అయితే.. ఈ క్ర‌మంలో లోక్ స‌భ‌ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయ‌డు ప్ర‌సంగించారు. ఒక్క‌సారిగా ఆంద్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా రావాల‌ని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆంద్ర‌ప్ర‌దేశ్ తో ఏర్ప‌డిన ఆర్థిక లోటు కార‌ణంగా, ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఆ అంశం నీతి ఆయోగ్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.


ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని



అంతేకాకుండా.. దేశంలో చాలా రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా రావాల‌ని కోరుకుంటున్నార‌ని, పంజాబ్ రాష్ట్రాలు సైతం ప్ర‌త్యేక హోదా కోర‌డం స‌మంజ‌సం కాద‌ని అన్నారు. మొత్తం మీద ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని చాలా రోజుల త‌రువాత వెంక‌య్య వ్యాఖ్యానించ‌డంతో ఒక్క సారి తెలుగు ప్ర‌జ‌లకు దిమ్మ దిరిగినట్ట‌య్యింది. ఎప్పుడులేని వెంకయ్య నాయుడు ప్ర‌త్యేక హోదా పై ఇంత‌టి నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం పై ప‌లువురు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాదిన్న‌ర కాలంలో వెంకయ్య ఏనాడు హోదా పై స్పందించ‌లేదు క‌దా.. క‌నీసం ప్ర‌త్యేక హోదా పై కేంద్రానికి త‌న‌వంతుగా  విన్న‌వించిన దాఖ‌లు లేవు. అంతేకాకుండా తాజాగా ఏపీ లో ఓ కార్య‌క్ర‌మానికి పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా పై పెద్ద‌గా ఒరిగేది ఎమీ ఉండ‌ద‌ని సెల‌విచ్చారు. అంతేకంటే రాష్ట్రానికి అభివృద్ది ప‌థ‌కాలు తీసుకువ‌స్తే ఇంకా బాగుటుంద‌ని తెలిపారు.


ఒకానొక సందర్భంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ‌నాయ‌కులను ఉద్దేశించి వెంక‌య్య‌ వ్యంగంగానే మాట్లాడారు. నేను తెలుగు రాష్ట్రాల ఎంపీ కాద‌ని.. మీరు ఓటు వేస్తే గెలిచి పార్ల‌మెంట్ కు పోలేద‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో అప్ప‌ట్లో ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర సంచ‌ల‌న‌మే రేక్కెత్తించింది. అయితే గ‌త విభ‌జ‌న స‌మ‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న బిల్లులో ప్ర‌త్యేక హోదా ను పొందుప‌రిచింది.  వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదా ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చి తీరాల్సిందే. కానీ ఎన్డీఏ ప్ర‌భుత్వం విస్మ‌రించింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌త్యేక హోదా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఏలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఇది ఇలా ఉండగా.. గ‌తం ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌తి ప‌క్షంలో ఉన్న వెంక‌య్య.. నాడు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఓ రెంజ్ లో ప‌ట్టుబ‌ట్టారు. రాష్ట్ర విడిపోతే… ఏపీ తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని రాజ్య‌స‌భ సాక్షిగా ఆయ‌న ఆరోపించారు. అయితే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం అనూహ్యంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.


దీంతో గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఏపీ కి ప్ర‌త్యేక హోదా ఊస‌త్త‌లేదు క‌దా.. క‌నీసం దాని పై మాట్లాడిందిలేదు. తాజాగా ఆయ‌న ఏపీ ప్ర‌త్యేక హోదా పై వ్యాఖ్య‌నించారు. చాలా రోజుల త‌రువాత పార్ల‌మెంట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర‌మంత్రి వెంకయ్య‌నాయుడు గ‌ళం విప్ప‌డంతో ఒక్కసారి నిప్పుల మీద నీలు చ‌ల్లినట్ట‌య్యింది. అప్పుడేప్పుడో రాష్ట్ర ఏర్పాటుకు ముందు నినందించిన వెంకయ్య... ఆ త‌రువాత ఆయ‌న ప్ర‌త్యేక హోదా అంశాన్ని పక్క‌న ప‌డేశారు. ప్ర‌త్యేక హోదా వ‌చ్చే ప‌రిస్థితుల్లేవు.. ప్యాకేజీ కోసం ప్ర‌య‌త్నించ‌డం మేలు అని చెబుతూ వ‌చ్చిన వెంక‌య్య అనూహ్యంగా.. ఆంద్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా రావాల‌ని కోరుకుంటున్నా అని పార్ల‌మెంట్ లో వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇదీలా ఉంటే గ‌త ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా పై గ‌ట్టి ప‌ట్టుప‌డుతున్న విష‌యం విదిత‌మే. తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం ఆత్మ‌బ‌లి దానాలు కూడా చోటు చేసుకున్నాయి. 


ఈ క్ర‌మంలో గ‌త అమరావ‌తి శంకుస్థాప‌నకు వ‌చ్చిన న‌రేంద్ర‌మోడీ ప్ర‌త్యేక హోదా పై ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న ఆశ‌లు ఉన్నా.. అడియాశ‌లు చేసి వెళ్లారు ప్ర‌ధాని మోడీ. దీంతో ఏపీ రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వం పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక గ‌త బీహార్ ఎన్నిక‌ల్లో మోడీ స‌ర్కార్  ఘోర ప‌రజయాన్ని మూట గ‌ట్టుకుంది.  దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కేంద్ర‌మంత్రి వెంకయ్య‌నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదు. అంతేకాకుండా.. దేశ స‌మ‌గ్ర‌త‌ను సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని వెంక‌య్య కోరారు. కాగా ఇన్నాళ్ళు హోదా విష‌యంలో స్పందించ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని వెంక‌య్య నాయుడు ఇలా ఒక్క సారిగా హోదా పై స్పందించ‌డం వెన‌క తాజాగా ఏపీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కార‌ణం కాక‌పోలేదన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. 


ఇక పోతే ఇక్క‌డ ఒక‌టి మాత్రం నిజం.. ఏపీ ప్ర‌త్యేక హోదా పై నీతిఆయోగ్ పేరుతో కేంద్రం ప్ర‌త్యేక హోదా పై నాట‌కాలు ఆడుతోంది. అయితే నీతి ఆయోగ్ చెప్పింద‌ని బీహార్ కి ల‌క్ష‌న్న‌ర కోట్ల ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించారా? జ‌మ్మూ కాశ్మీర్ కి కూడా అదే త‌ర‌హాలో ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్పుడు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి మాత్ర‌మే నీతి ఆయోగ్ అనుమ‌తి ఎందుకు అవ‌స‌ర మొచ్చిందన్న అనుమానాలకు స‌మాధానం ఇవ్వ‌డం మంత్రి వెంక‌య్య‌నాయుడు మ‌రిచారు. మ‌రోవైపు.. వెంక‌య్య నిజానికి ఆయ‌న గుండె లోతులోనుంచి వ‌చ్చిన మాటాగా భావించాలా?, ఇదే విష‌యంపై ఆయ‌న కేంద్రం పై ఒత్తిడి పెంచి ప్ర‌త్యేక హోదా తీసుకొచ్చేందుకు వెంక‌య్య ప్ర‌య‌త్నిస్తారా? ఏపీలో పెరుగుతున్న నిర‌స‌ల‌న‌కు తూతూ మంత్రంగా డైలాగులు వేశారా..? అన్న‌ది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: