అతడు భారతదేశ మహా సాహస పుత్రుడు. గతంలో ఒకసారి హిందువులు ఇండియాలో 75 కోట్ల మంది ఉండగా ముస్లింలు 25 కోట్లు మాత్రమే ఉన్నారని, మీ పోలీసులను 25 నిమిషాల పక్కనబెడితే ముస్లింల శక్తి ఏమిటో చూపిస్తాం అంటూ వాగిన గొప్ప శాసనసభ్యుడు. కానీ తనమీద తోటి ముస్లింలే పాత బస్తీలో గతంలో హత్య చేయడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపర్చినప్పుడు అతడిని హిందూ పోలీసులే కాపాడారు మరి.

 

ఆ విషయం పక్కనబెట్టి ప్రస్తుత విషయానికి వస్తే, సుల్తాన్ బజార్, తదితర కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఎంఐఎం ఒత్తిడి లోనైన ప్రభుత్వం మెట్రో రైలును నిర్మిస్తున్న ఎల్ అండ్ టీని మెట్రో రైలు మార్గాన్న మార్చాలని కోరింది కూడా.

 

కాని అదే కంపెనీ ఇప్పుడు మెట్రో రైలు మార్గాన్ని మార్చే ప్రసక్తి లేదని, అలా మార్చితే నిర్మాణ వ్యయం చుక్కలంటుతుందని కాబట్టి తాము ముందు వేసుకున్న ప్లాన్‌కే కట్టుబడి ఉంటామని ఎల్అండ్ టీ ప్రకటించింది. ప్రభుత్వం కూడా దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన అక్బరుద్ధీన్.. మెట్రో రైల్‌ మార్గాన్ని మార్చకపోతే పాత బస్తీలో మెట్రో రైలు ముందుకు నడవదని హెచ్చరించారు.

 

ఎంఐఎమ్ పార్టీ సంధించిన ఈ సవాలును కేసీఆర్ ఎలా స్వీకరిస్తారు? సానియా మీర్జాకు మళ్లీ ప్రైజ్ మనీ ఇవ్వడం ఈ సమస్యను పరిష్కరించదు. మరోరకంగా ఎంఐఎమ్‌ను బుజ్జగిస్తారేమో చూడలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: