ప్రపంచంలో వైజ్ఞానానికి కూడా అంతుచిక్కని కొన్నివింతలు సమాజంలో జరుగుతుంటాయి. ఇవి నమ్మశక్యం కాకపోయినా కళ్లముందు ఉండటంతో నమ్మాల్సి వస్తుంది. ముఖ్యంగా  కొంత మంది శిశువులు చాలా విచిత్రం రూపంలో పుడుతుంటారు..రెండు తలలు, నాలుగు చేతులు, ఒకే తల  నాలుగు చేతులు నాలుగు కాళ్లు, రెండు తలలు నాలుగు చేతులు ఇలా వింత ఆకారాలతో జన్మిస్తూ ఉంటారు..ఇలాంటివి జంతువుల్లో కూడా సంబవిస్తుంది. అయితే డాక్లరు మాత్రం ఇవి జన్యుపరమైన లోపాల వల్ల జరిగేదే అని కొట్టి పడేస్తుంటారు.

తాజాగా కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లా హొసూరు తాలూకా పూనపల్లి గ్రామానికి చెందిన మునిస్వామి, లక్ష్మి దంపతులు వీరికి 2006లో లక్ష్మితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భిణి అయిన లక్ష్మి ప్రసవం కోసం పుట్టింటికి వేళ్లింది. రాత్రి పూట నొప్పులు రావడంతో ఆమె తల్లితండ్రులు పెరుగోపనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన కొద్దిసేపటికే ఆమె 3.4 కిలోల బరువుగల మగ శిశువును ప్రసవించింది. ఇక ఆ శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఒకే తల ఉండటంతోత అందరూ ఆశ్చర్య పోయారు. ఈ వింత శిశువును చూడటానికి చాలా మంది వచ్చారు. అయితే పిల్లల వైద్యులు పరిశీలించి, శిశువును చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు.  


బంగ్లాదేశ్ లో రెండు తలల శిశువు


గతంలో ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చెందిన కాకర్ల భూలక్ష్మి రెండో కాన్పులో రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించి వెంటనే కన్నుమూశాడు. గత నెలలో బంగ్లాదేశ్ లో రెండు తలలతో ఉన్న ఒక వింత శిశువు జన్మించాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ్ బారియాలో ఈ సంఘటన జరిగింది.  తలలను మినహాయిస్తే మిగతా అవయవాలన్నీ మిగతా శిశువులాగే సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా భగవంతుడి సృష్టి అని అంటారు మరికొందరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: