పాకిస్తాన్ నుంచి అందిన ఒక ఫొటో ప్రస్తుతం ఇంటర్నట్‌లో హల్ చల్ సృష్టిస్తోంది. ఈ చిత్రం రెండు విశిష్ట ప్రత్యేతలను కలిగి ఉంటోంది. గురుపూరబ్ లోని గురునానక్ మందిరాన్ని చూడటానికి భారత్ నుంచి తరలి వచ్చిన కొంతమంది సిక్కులకు ఒక పాకిస్తానీ మహిళా కమాండో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ చిత్రం తెలుపుతోంది. భారత్ నుంచి ప్ర్తత్యేక రైలులో వచ్చిన 100 మంది సిక్కు యాత్రికులను ఈ మహిళా కమాండో పరిరక్షిస్తోంది.

 

సిక్కు మత స్థాపకుడు బాబా గురునానక్ 547వ జయంతిని జరుపుకునేందుకు ఈ భారతీయ సిక్కు యాత్రికులు పాకిస్తాన్ వచ్చారు. ఈ సందర్భంగా వారి రక్షణ బాధ్యతల్లో ఉన్న మహిళా కమాండోను, ఆయాత్రికులను కలిపి తీసిన ఆ ఫోటో పాక్ గురించి ఒక బిన్నమైన వాస్తవాన్ని చెబుతోంది,. పాకిస్తాన్ సమాజంలో మహిళలంటే బుర్ఖాల్లో మాత్రమే జీవించేవారిగా సాంప్రదాయిక ముద్ర ఉంటూ వస్తోంది. అలాగే పాకిస్తాన్‌లో భద్రతపై హిందువల్లో చాలా భయాలు, అనుమానాలు ఉంటూ వస్తున్నాయి.

 

కాని వంద మంది సిక్కుయాత్రికులను నీడలా వెన్నంటి నడుస్తూ వారి సంరక్షణ బాధ్యతను తనపై వేసుకున్న ఆ పాకిస్తానీ మహిళా కమాండో పాక్ మహిళల పట్ల ప్రచారంలో ఉన్న సాంప్రదాయిక భావనలను ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తోంది. అందుకే ఇంటర్నెట్‌లో ఆ మహిళా కమాండో ఫోటో ఇప్పుడు నిజంగానే వెలిగిపోతోంది.

 

గురు నానక్ జన్మస్థలం లాహోర్ సమీపంలోని నాంకనా సాహిబ్. ఆయన జన్మస్థలంలో మూడు రోజుల పాటు జరిగే గురు నానక్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి శిుక్రవారం వాఘా రైల్వే స్టేషన్ న్‌లో దిగిన వందలాది భారతీయ సిఖ్కు యాత్రికులకు తలపై మేలిముసుగులోని పాకిస్తానీ మహిళా పోలీస్ కమాండో అత్యాధునిక ఆయుధం ధరించి రక్షణగా నిలబడటం ఆన్‌లైన్‌లో వేలాది మందిని ఇట్టే ఆకర్షించింది.

 

సిక్కుమత గురువు గురునానక్ జన్మస్థలమైన నాంకనా సాహిబ్‌‌ను దర్సించేందుకు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు ప్రతి యేటా ఆ ప్రదేశానికి వస్తుంటారు. భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయ భిన్నాభి్ప్రాయాలు, మతపరమైన ప్రభావాలూ పని చేస్తుండవచ్చు. కానీ ఏ దేశమైనా తనన సందర్సించడానికి వచ్చిన అతిధులకు తగిన రక్షణ కల్పించడం సహజమే. కాని ఇక్కడ వందలాది సిక్కు యాత్రికులకు ఒక పాకిస్తాన్ మహిళా  పోలీసు కమాండో రక్షణ కల్పించడం చూడ్డానికే అద్భుతంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

పాకిస్తాన్ గురించి, దాని మతం గురించి, ప్రత్యేకించి ఆ దేశ మహిళల గురించి మనలో పేరుకుపోయిన మూస భావాలను ఈ ఫొటో తోసి పారేస్తుంది. ఈ చిత్రం మీలో ఎన్నో అభి్ప్రాయాలను చొప్పించవచ్చు కానీ ఈ చిత్రం ప్రేరేపిస్తున్న ఉమ్మడి భావోద్వేగాన్ని మాత్రం ఎవరైనా తప్పక గౌరవించాల్సిందే. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: