తెలుగు చిత్ర సీమలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ  హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ఇక బాలయ్య ఎక్కువగా మాస్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువ తీశారు..అందుకే అయనకు మాస్ ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంది. గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కి మాస్ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఫిదా అయిపోతారు. మొన్నజరిగిన సార్వత్రిక ఎన్నికలో హిందూ పురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బాలకృష్ణ సినీనటుడిగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా తన హీరోయిజాన్ని చూపిస్తున్నారు..హిందూపురం అభివృద్దికి ఇప్పటికే ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అంతే కాదు బాలయ్య ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు బావమరిదే కాకుండా వియ్యంకుడు కూడా..అందుకే ఆయన అంటే రాజకీయ నాయకుల్లో కాస్త గౌరవం ఎక్కువే..ఇప్పటికే బాలయ్య హీరోయిజం తెలిసినవారు ఆయనకు సరెండరవుతున్నారు.  


బీజేపీ నేతలు కూడా బాలయ్యకు ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారు. ఏదైనా పనికోసం ఆయన వెళ్తే చాలు బీజేపీ మంత్రులు ఎదురెళ్లి ఆహ్వానించి దగ్గరుండి పనిచేసి పంపిస్తున్నారు.  తాజాగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరికి సీరియస్ వార్నింగ్ తో బెంబేలెత్తించాడు. హిందూపురం నియోజకవర్గానికి వెళ్లే వాటర్ పైప్ లైన్ కు కొందరు రంథ్రాలు చేశారని... అందువల్ల నీరు హిందూపురానికి రావడం లేదని బాలయ్యకు ఫిర్యాదు అందిందట. దీంతో ఆయన తన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యేపై మండిపడ్డారు.

బాలకృష్ణ నియోజవకర్గం హిందూపురంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్ లైన్లు వేసి తీసుకెళ్తున్నారు. దీని వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి హస్తం ఉందంటూ కొందరు బాలకృష్ణకు చెప్పారట. దీంతో హనుమంతరాయచౌదరికి పై బాలయ్య బాగా సీరియస్ కావడంతో  పైప్ లైన్ల లీకేజిలకు తనకు సంబందం లేదని... పదేపదే తనను నిందించవద్దని ఆయన బతిమాలుకున్నారట. దీంతో  కాస్త కోపం తగ్గించుకొని మరోసారి ఇది రిపీట్ అయితే సీరియస్ గా ఉంటుందని చెప్పాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: