గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో 70 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్ జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తింటుందా.. అప్పుడే జగన్ క్రేజ్ అంతా ఆవిరైపోయిందా.. ప్రతిపక్షనేతగా జగన్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారా.. ఇలాంటి అనుమానాలు వరంగల్ ఉపఎన్నిక తర్వాత రాక మానవు. తెలంగాణలో వైసీపీకి అంతగా అవకాశాలు లేకపోయినా.. పోటీ చేసి  భంగపాటైన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు వైసీపీని అడ్డగోలుగా విమర్శించడానికి టీడీపీకి ఈ ఎన్నికల మంచి అవకాశం కల్పించాయి. అందులోనూ వరంగల్ ఉప ఎన్నికలో ఏకంగా ఐదో స్థానానికి పడిపోవడం టీడీపీ నేతలకు మంచి ఆనందాన్నిస్తోంది. తెలంగాణలో జగన్ పార్టీకి పట్టిన గతే ఆంధ్రాలోనూ పడుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు జోస్యం చెబుతున్నారు. దీని కోసం సదరు నేతలు కొత్త సిద్ధాంతం కూడా ప్రతిపాదిస్తున్నారు. 

అదేంటో తెలుసా.. పార్టీ పెట్టిన మొట్టమొదటి సారే విజయం సాధించిన పార్టీలకు ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉండవట. ఇందుకు ఉదాహరణగా వారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గుర్తు చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ సక్సస్ గాని పార్టీలు  ఆ తర్వాత సక్సస్ కావని చెప్పేందుకు ఉదాహరణగా వారు పీఆర్పీని చూపిస్తున్నారు. వైసీపీ కూడా పీఆర్పీ తరహాలోనే జెండా పీకేస్తుందని జోస్యం చెబుతున్నారు. 

అయితే ఇలాంటి టీడీపీ నేతలు కొన్ని విషయాలను కావాలనే మరచిపోతున్నారేమో అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఆటు పోటు చూసింది. తెలంగాణలోనే ఘోర వైఫల్యాలు చూసింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ సక్సస్ కాలేదా.. అలాగే లేటెస్టు ఉదాహరణలు చూసుకుంటే ఢిల్లీలో ఆప్ పార్టీ ఫస్ట్ టైమ్ మెజారిటీ రాకపోయినా ఆ తర్వాత 70కి 67 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకోలేదా..?

అయినా జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అని చెప్పడానికి అప్పుడే ఏం తొందరొచ్చింది. ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉంది. కదా.. ఆ సంగతి టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ప్రత్యర్థిని సైకలాజికల్ గా దెబ్బతీసే మాటల యుద్ధమే ఇది కావచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: