ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మనుషులను విచక్షణారహితంగా చంపుతున్నారు. ఎక్కడ పడితే..అక్కడ బాంబులతో వింద్వంసాలు సృష్టిస్తున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లా టెర్రరిస్టుల గురించి కామెంట్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలిసినా వారిని అడ్డుకోలేరని ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్టులు నిర్ణయించుకుంటే , తనతో సహా ఎవరినైనా హత్య చేయగలుగుతారని, సైనికులను అందరినీ తెచ్చి మోహరించినా వారిని ఆపలేరని అన్నారు. పిఓకె పాకిస్తాన్‌లో ఉంది, అది అలాగే కొనసాగుతుంది, జమ్మూ-కాశ్మీర్‌ భారత్‌లో ఉన్నాయి, ఇవి ఇలాగే ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలని అబ్దుల్లా అన్నారు. పిఓకె భారత్‌లో అంతర్భాగమని కొన్నేళ్లుగా నేనూ చెబుతూ వచ్చాను, కానీ..ఏం జరిగింది? భారత్‌లో అంతర్భాగంగా చేసుకోగలిగామా? అంటూ అబ్దుల్లా ప్రశ్నించారు. యుద్ధం పరిష్కారం చూపదు, ప్రాణాలు మాత్రం పోతాయి. చర్చలే అందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశమని ఆయన అన్నారు.

 మరో వైపు ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడ్డారు. రాజ్యాగపరంగా పిఓకె భారత్‌లో అంతర్భాగమని 1994లో పార్లమెంట్‌ తీర్మానించినట్టు జమ్మూ-కాశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత నిర్మల్‌సింగ్‌ పేరొన్నారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను అబ్దుల్లా సమర్థించారు. ఆయన దేశాన్ని వీడుతానన్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అబ్దుల్లా అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: