ఈ మద్య డబ్బుంటే చాలు దేన్నైనా కొనవచ్చు నమ్మకం మనిషికి వచ్చింది..ఈ మద్య విద్య వ్యాపారంగా మారింది..ముఖ్యంగా డిగ్రీ పట్టాలు చాలా ఈజీగా డబ్బులు పెట్టి కొంటున్నారు.  అర్హత లేకుండానే ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ పట్టాలు తెచ్చుకునే దౌర్భాగ్యం మన దేశంలో దాపురించింది. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఒక అడుగు ముందుకు వేసి తాము ఒరిజినల్ డాక్టర్లం దానికి ఇవిగో మా డిగ్రీ సర్టిఫికెట్లు అంటూ చూపించి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో పాతబస్తీలో గల తలాబ్‌కట్టా, హుమాయన్‌ నగర్‌ లో గల వైద్యశాలలపై పోలీసులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 50 మంది నకిలీ వైద్యులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ దొంగ డాక్టర్లు ఎలాంటి అర్హత లేకున్నా తమకు తెలిసిన వైద్యంతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా తెలిసి తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఇటీవలి కాలంలో ఓ రోగి ప్రాణాలు తీసిన నకిలీ వైద్యుడు అనంతరం మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోవడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మద్య తరగతి ప్రజలు ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద హాస్పిటల్స్ కి పోలేక ఇలాంటి చిన్న డాక్టర్లను సంప్రదిస్తుంటారు. ఇదే అదునుగా ఇలాంటి దొంగ డాక్టర్లు పుట్టుకు వస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: