నంద‌మూరి బాల‌కృష్ణ దాదాపుగా తెలుగు వారికి సుప‌రిచితుడైన వ్యక్తి. తెలుగు సినిమా త‌న నాన్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సత్వాన్ని అందిపుచ్చుకుని ఎదిగిన‌వాడు. ఆయ‌న తెర పైకి వచ్చాడంటే..అంతే తెలుగు ప్రేక్ష‌కులు కేరింత‌లు,చ‌ప్పట్ల‌తో ఆహ్వానిస్తారు. ఇక ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ, మోహం లోని అవ‌భావాలు ఆయ‌న డైలాగ్ కు స‌రిపోయే విధంగా ఉంటాయి. అందుకే తెలుగు ప్ర‌జ‌ల‌కు బాల‌య్య‌బాబు డైలాగ్ లు అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ఆయ‌న నిజ జీవితంలో కూడా ఇవే డైలాగ్ లు వేస్తే ఇంకే ముంది. అలాంటి వ్య‌వ‌హారానికి తెర తీశారు న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌. తాను అనుకున్న ప‌ని సాధించడంలో ఎవరు అడ్డొచ్చినా ఖ‌బ‌డ్దార్ అంటారని అప్పుడే తెలుగు దేశం పార్టీలో టాక్ వ‌చ్చేసింది. బాల‌య్య వేసే దెబ్బ‌కు టీడీపీ యే కాదు, బీజేపీ నేత‌లూ జాగ్ర‌త ప‌డుతున్నారు. అయితే.. ఈ డైలాగ్ లు నంద‌మూరి మార్క్ పాల‌న‌కు సంకేతాలా? లేక సినిమా డైలాగ్ ల‌కు ప‌రిమిత‌మా అన్న విష‌యం తెలియాల్సి ఉంది.


హిందూపురం ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాల‌కృష్ణ‌కు టీడీపీ లో బ్ర‌హ్మాండ‌మైన ఇమేజ్ ఉంది. అయ‌న‌కు తెలుగు సినీ అభిమానుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో పార్టీలోనూ అదే ర‌క‌మైన ఇమేజ్ ఉంది. దీంతో ఆయ‌న త‌న మార్క్ పాల‌న చూపించాల‌ని భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్న‌గారూ ఎన్టీఆర్ త‌న‌యుడిగా.. సీఎం  చంద్ర‌బాబు వియ్యంకుడిగా.. బావ‌మ‌రిదిగా... లోకేష్ కు మామ గారిగా పార్టీలో బాల‌య్య అమిత ప్రాధాన్యం ద‌క్కుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌త్యేక చొర‌వ చూపిస్తున్నారు. రాజ‌కీయంగా అనుభవం త‌క్కువే అయినా త‌న నియోజ‌క వ‌ర్గం పై ఆయ‌న చూపిస్తున్న శ్ర‌ధ్ధ మాత్రం త‌క్కువేమీ కాదు. స్థానిక నాయ‌కుల‌తో మాట్లాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నులు చేయిస్తూ.. ఆ ప‌నుల తీరునూ ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 


ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఇబ్బందులు సృష్టించార‌ని అనిపిస్తే చాలు వాయించిప‌డేస్తున్నార‌ట‌. దీంతో హిందూపురం ప్ర‌జ‌లు బాల‌య్య అభిమానులు ఆయ‌న్ను అక్క‌డ హీరో లాగే చూస్తున్నారు. కానీ అనంత‌పురం ప్ర‌జాప్ర‌తినిధులు అధికారులు మాత్రం బాల‌య్య‌ను చూసి కంగారు ప‌డుతున్నార‌ట‌. ఆధికారులే కాదు, పార్టీ సీనియ‌ర్ నాయకులు సైతం ఆయ‌న ఫోన్ వ‌స్తే చాలు జంకుతున్నార‌ని ప‌లువురు గుస గుస లాడుతున్నారు. తాజాగా బాలయ్య క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే హ‌నుమంత రాయ చౌద‌రికి ముచ్చెమ‌ట‌లు పోయించారు. ఇంత‌కు ముందు కూడా ఉత్తరాంధ్ర‌కు చెందిన ఓ మంత్రికి బాల‌య్య త‌న త‌డాఖా ఏంటో రుచి చూపించారు. ఇప్ప‌టికే బాల‌య్య హీరోయిజం తెలిసిన‌వారు ఆయ‌న‌కు స‌రెండ‌ర‌వుతున్నారని స‌మాచారం. బీజేపీ నేత‌లు కూడా బాల‌య్య‌కు ప్ర‌త్యేక మర్యాద‌లు చేస్తున్నారు.


ఏదైనా ప‌నికోసం ఆయ‌న వెళ్తే చాలు బీజేపీ మంత్రులు ఎదురెళ్లి ఆహ్మానించి ద‌గ్గ‌రుండి ప‌నిచేసి పంపిస్తున్నారు. ఇది చాలు బాల‌య్య రేంజీ ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి. బాల‌య్య హిందూపురం నియోజ‌క వ‌ర్గం కోసం ఏమైనా చేసేట‌ట్లున్నారని అంటున్నారు టీడీపీ నేత‌లు. హిందూపురం నియోజ‌క వ‌ర్గానికి వెళ్లే వాట‌ర్ పైప్ లైన్ కు కొంద‌రు రంధ్రాలు చేశార‌ని.. అందువ‌ల్ల నీరు హిందూపురానికి రావ‌డం లేద‌ని బాల‌య్య‌కు ఫిర్యాదు అందింద‌ట‌. దీంతో ఆయ‌న త‌న పొరుగు నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే పై మండి ప‌డ్డార‌ట. బాల‌కృష్ణ నియోజ‌క వ‌ర్గం హిందూపురం లో తాగునీటి కోసం క‌ళ్యాణ దుర్గం నియోజ‌క వ‌ర్గ గుండా పైప్ లైన్లు వేసి  తీసుకెళ్తున్నారు. అయితే.. ఇటీవ‌ల త‌ర‌చూ ఆ పైపుల‌కు రంధ్రాలు పుడుత‌న్నాయ‌ట‌. దీని వెనుక క‌ళ్యాణ దుర్గం ఎమ్మెల్యే హ‌నుమంత రాయ చౌద‌రి హ‌స్తం ఉందంటూ కొందరు బాల‌కృష్ణ కు చెప్పారట‌. ఇంకేముంది.. బాల‌య్య కోపం కొండ‌లా పెరిగిపోయింది. నా ద‌గ్గ‌ర రాజ‌కీయాలు చేయొద్దు అంటూ హ‌నుమంత్ చౌద‌రికి వార్నింగ్ ఇచ్చారట‌.


ఒక్క సారితో ఆప‌కుండా ఏ కార్య‌క్ర‌మంలో ఆయ‌న క‌నిపించినా బాల‌య్య వార్నింగ్ ఇస్తూ ఉండే స‌రికి పాపం.. చౌద‌రి బెదిరిపోయి బాల‌య్య‌కు వివ‌ర‌ణ ఇచ్చుకున్నార‌ట‌. పైప్ లైన్ల లీకేజీల‌కు త‌నకు సంబంధం లేద‌ని.. ప‌దేప‌దే త‌న‌ను నిందించ‌వ‌ద్ద‌ని ఆయ‌న బ‌తిమాలుకున్నార‌ట‌. దీంతో బాల‌య్య కోపం త‌గ్గి స‌ర్లే ఇంకోసారి రిపీట్ కావ‌ద్దు అంటూ వ‌దిలేశార‌ట‌. అదీ సంగ‌తి. ఇక‌పోతే నంద‌మూరి ఎన్టీ రామారావు రాజ‌కీయాలు అందిపుచ్చుకున్న వారు దాదాపుగా లేర‌నే చెప్పాలి. నంద‌మూరి హ‌రికృష్ణ ఒక‌నొక ద‌శ‌లో పార్టీలోకి క్రియాశీలంగా పోషించి..1994 లో చంద్ర‌బాబు క్యాబినేట్ లో ర‌వాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంత‌రం రాజ‌కీయాల్లో దాదాపుగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక ఆయ‌న త‌మ్ముడు నంద‌మూరి బాల‌కృష్ణ చాలా రోజుల త‌రువాత 2014 సార్వ‌త్రిక పాల‌న‌లో త‌న తండ్రి ఎన్టీఆర్ నియోజ‌క వ‌ర్గం హిందూపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపోందారు. 


హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ


ఈ క్ర‌మంలో బాల‌య్య త‌న మార్క్ పాల‌న ఉండేలా జాగ్ర‌త ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆంతేకాకుండా త‌న తండ్రిని గెలిపించిన నియోజ‌క వ‌ర్గం కావ‌డంతో.. తాను కూడా త‌న తండ్రికి ఏ మాత్రం తీసిపోన‌న్న మార్క్ పాల‌న రావాల‌ని యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న సినిమా డైలాగ్ ల‌కు ప‌దును పెట్టుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆయితే బాల‌య్య లో వ‌చ్చిన ఈ మార్పు..ఆయ‌న త‌న నంద‌మూరి మార్క్ పాల‌నేనా? లేక సినిమా డైలాగ్ లేనా? అన్నది తెలియాల్సి ఉంది. ఎమైతే నేం.. ఆయ‌న మార్పుతో సామాన్య ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగితే అంత‌కంటే ఇకేం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: