తెలంగాణ సీఎం కేసీఆర్ ఏలుబడిలో అందరికన్నా ఎక్కువగా లాభపడింది ఎవరూ అంటే పోలీసులే అని ఎవరైనా చెబుతారు. కేసీఆర్ కుర్చీ ఎక్కినదగ్గర నుంచి పోలీసు డిపార్ట్ మెంట్ ను అపురూపంగా చూసుకుంటున్నారు. వాళ్ల జీతాలు పెంచారు. పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ లు ప్రకటించారు. వాళ్ల కోసం కొత్త కొత్త మోడల్ కార్లు అందుబాటులో ఉంచారు.

పోలీసుల సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేది లేదని ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లలోనూ కానిస్టేబుళ్లకు రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే కేసీఆర్ ఎందుకు పోలీసులను అంతగా మంచి చేసుకుంటున్నారు. ఆర్థికంగా భారమైనా సరే ఎందుకు పోలీసులపై అంతగా 
ప్రేమ కురిపిస్తున్నారు.?

ఈ ప్రశ్నకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొత్త భాష్యం చెప్పారు. కేసీఆర్ పోలీసులను ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదించారని కొత్త పాయింట్ లేవదీశారు. కేసీఆర్ సామదానబేద దండోపాయాలు ఉపయోగించి విపక్ష నాయకులను తన పార్టీలోకి రప్పించుకున్నారని.. అందుకు చాలాచోట్ల స్థానిక పోలీసుల సాయం తీసుకున్నారని తన పత్రికలో రాసుకొచ్చారు.

ఉద్యమ జోష్ లో, తెలంగాణ సాకారంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు పార్టీ యంత్రాంగం అసలు లేనే లేదని.. ఆ విషయం తెలిసిన కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కాక తన పార్టీలోకి వలసలను ప్రోత్సహించారట. ఇందుకు గతంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన ఆకర్ష మంత్రాన్నే విపక్షనేతలపై ప్రయోగించారట. అయినా లొంగని వారిని పోలీసులతో బెదిరించారట. ప్రత్యేకించి జిల్లాస్థాయి చోటామోటా నాయకుల విషయంలో కేసీఆర్ బాగా పోలీసులను వాడుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: