ఏపీ రాజధాని సమీపంలోని విజయవాడలో కలకలం రేగింది. సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట  ఓ రైతు అందరినీ హడలెత్తించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని తన చావుకు కారణం పవన్ కళ్యాన్ అంటూ టెన్షన్ వాతావరణం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అడ్డెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజులు అనే రైతు సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఉన్న 100 అడుగుల చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కి  ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

అంతేకాదు, దీనికి సంబంధించి సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచాడు. వ్యవసాయంలో నష్టం, బాధిస్తున్న క్యాన్సర్ వ్యాధి, ఆర్థిక సమస్యలే తన ఆత్మహత్యా యత్నానికి కారణమని నోట్ రాసి ఉంచాడు.ఎలక్షన్‌లకు ముందు పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన మాటలు నమ్మి టీడీపీ కోసం ప్రచారం నిర్వహించాను.  దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లందరితో టీడీపీకి  ఓటు వేయాలని ఇల్లు ఇల్లూ గల్ల గల్లీ తిరిగానని ఇక టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో తాను ఆ ఊర్లో తిరగలేక పోతున్నా అని అందరూ తనను మోసం చేశాడు అంటున్నారని నీ మాట నమ్మి టీడీపి గెలిపిస్తే మాకు వొరిగిందేమిటీ అని నిలదీయడంతో తట్టుకోలేక పోతున్నా అని అన్నారు.

తాను పవన్ వీరాభిమానినని, టీడీపీ వార్డు సభ్యుడినని చెబుతున్నాడు. వ్యవసాయంలో తననకు దాదాపు 3.20 లక్షల మేరకు అప్పులు అయ్యాయని, ఈ విషయాల గురించి బాబుకు చెప్పుకోడానికి వస్తే కనీసం కలిసేందుకు కూడా వీలు కుదరలేదని వాపోయాడు. దీంతో చంద్రబాబు కటౌట్ ఎక్కి ఆత్మహత్య ప్రయ్నం చేశాడు..అయితే ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉండటంతో చంద్రబాబు కలవలేకపోయారని మధ్యాహ్నం 3 తర్వాత సందర్శకులను కలుస్తారని, అందువల్ల ఆటంకాలు లేవని చెప్పడంతో గోవిందరాజులు కిందకు దిగి వచ్చారు. ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని వాహనంలో అక్కడి నుంచి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: