తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం చండీయాగం చేయాలని చూశారు..కానీ అప్పుడు కొన్ని ప్రకృతి  అవాంతరాలు రావడంతో ఆ యాగం వాయిదా వేశారు. ఈ నెలలో చండీయాగాన్ని ఖచ్చితంగా చేయాలని గట్టి పట్టే పట్టారు. ఇక ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రత్యేకంగా పిలవాలని చూస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.


మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని ఈ నెల 23 నుంచి తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీయాగం చేపట్టనున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అత్యంత గౌర‌వించే త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలోనే ఈ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో దేశ నలుమూలల నుంచి 1100 మంది వేదపండితులు, పీఠాధిపతులు పాల్గొననున్నారు.  రాష్ట్రం కరువు కాటకాల నుంచి బయట పడాలని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ చండీయాగం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ముఖ్యమంత్రి  కేసీఆర్ 


పూర్వం మహారాజులు తమ రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి యాగాలు చేసే వారు.  అయితే ఈ యాగానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ యాగానికి రావాలని కేసీఆర్ ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ కు కోరారు. ఇందుకు ప్రణబ్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఇకపోతే  శీతాకాల విడిది కోసం ప్రణబ్ ఈ నెల 18న హైదరాబాదుకు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఈ నెల 31 దాకా ఉంటారు. ఈ క్రమంలో ఈ నెల 27న చండీయాగంలో ప్రణబ్ పాల్గొంటారని రాష్ట్రపతి భవన్ నుంచి కేసీఆర్ కు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: