తెలుగు రాష్ట్రాల మీద ఒక్కొక్క సారి ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంది హై కోర్టు. తెలంగాణా ప్రభుత్వానికి ఆత్మహత్యల విషయంలో కితాబు ఇస్తూ ఏపీ కి మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు కంటే కాస్త సీరియస్ గానే మండిపడింది అని చెప్పాలేమో.

 

 రైతుల ఆత్మహత్యల కి ఏ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అని చూసిన హై కోర్టు తెలంగాణా ప్రభుత్వం చక్కగ స్పందించింది అని చెప్పుకొచ్చింది. వారికి నష్ట పరిహారం తో పాటు మరొక్కసారి అలాంటివి జరగకుండా తీసుకుంటున్న చర్యల పట్ల మెచ్చుకోలుగా మాట్లాడింది కోర్టు. ఏపీ సర్కారు మీద ఇదే విషయంలో మాట్లాడుతూ కోర్టు అడుగుతున్న ప్రశ్నలకి సైతం ఏపీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదు అంటూ కోపగించుకుంది.


 " కోర్టుకి అసహనం కలగాజేసేలా మీ సమాధానాలు ఉన్నాయి.. " అంటూ హై కోర్టు తీవ్ర ఆగ్రహం తో ఊగిపోయింది. ఇంత ఆగ్రహానికి మరొక కారణం కూడా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున విచారణ సమయంలో ఏపీ ఏజీ విచారణకి రావాల్సి ఉంది కానీ ఆయన రాలేదు. ఏజీ.. అదనపు ఏజీ కోర్టుకు రాకపోతే కేసు వాయిదా వేయాల్సిందేనా? కోర్టు ప్రశ్నించినంతసేపు బదులివ్వకుండా కూర్చునే ఉంటారా? రైతుల ఆత్మహత్యల మీద రాష్ట్రంలోనే ఉన్నత న్యాయాస్థానంలో చర్చ జరుగుతూ ఉంటె మీరు స్పందించారా? అని కోప్పడింది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: