"సచివాలయం - సెక్రటేరియట్ " హైదరాబాద్ రోడ్ల మీద నిత్యం తిరిగే సగటు తెలుగు వాడికి ఇది ఎక్కడ ఉందొ తెలుసు. ప్రతీ తెలుగు వ్యక్తికీ దీని వర్గీకరణ దీని విధి విధానాలూ తెలుసు అయితే ఈ సెక్రెటేరియట్ విషయంలో తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఎవరు వాడాలి ఎలా ఉపయోగించాలి అనే విషయంలో మీమాంస ఏర్పడింది.

 

 

 

 

తెలంగాణా ప్రభుత్వం తో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పారలల్ గా ప్రభుత్వ కార్యనిర్వాహణ కి సంబంధించిన ప్రాంతం ఈ సచివాలయం. పెద్ద ఎత్తున ఉద్యోగులు పని చేస్తున్న ఈ చోట ఎందరో పని చేయించుకోవడానికి నిత్యం వస్తూ ఉంటారు . మీడియా ప్రతినిధులు, రాజకీయ నేతలతో నిత్యం సందడిగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇలాంటి రొటీన్ కి భిన్నమైన వాతావరణం నిన్న కనపడింది. వివిద పార్టీలకు చెందిన నేతలు.. అధికారపక్షం తీర్థం పుచ్చుకునే సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి చెయ్యడం మామూలే కానీ ఇదంతా పార్టీ కార్యాలయాల్లో చేసుకోవాలి కానీ తెలంగాణా సచివాలయాన్ని వేదికగా తీసుకోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి.

 

 

 

 

 

హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం బాచుపల్లికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తెరాస లో జేరారు . ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు లో చేసినంత హడావిడి గా తెలంగాణా సచివాలయంలో హడావిడి చేసేసారు. సచివాలయాన్ని పార్టీ ఆఫీస్ గా మార్చేస్తున్నారు అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: