భారత దేశంలో గత కొంత కాలం నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మద్యతరగతి  కుటుంబీకులు చాలీ చాలని జీతంతో ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో గ్యాస్ నూనె స్టౌలు ఉండటం చేత దానికి బాగా డిమాండ్ పెరిగేది..ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ వాడకం పెరిగిపోయింది. దీంతో ఒక రెండేళ్ల నుంచి గ్యాస్ కి ధరలు అధికంగా పెరిగిపోయాయి.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయన్న శుభవార్త విన్నామో లేదో తాజాగా నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచారు. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ మీద ధరను రూ. 61.50 వంతున పెంచారు. ఒక కనెక్షన్కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడీ మీద ఇస్తున్నారు. అవి పూర్తైన వినియోగదారులు నాన్ సబ్సీడీ సీలిండర్ కోనాల్సిందే.

నిన్న రాత్రి నుంచి డీజిల్ చమురు సంస్థలు పెట్రోలు ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25 పైసల వంతున తగ్గించిన విషయం తెలిసిందే.  విమాన ఇంధన ధరలు మాత్రం 1.2 శాతం చొప్పున స్వల్పంగా తగ్గాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: