దేశంలో ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. విలాసవంతమైన జీవితం గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ మద్య చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ కిడ్నాప్ ఉదంతం సినిమాలో యాక్షన్ సీన్లు మరిపించాయి.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ స్కూల్లో 13 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి ఏకంగా రూ.రెండు కోట్లు డిమాండ్ చేశారు. అయితే, ఆ విద్యార్థిని స్కూల్లోనే కిడ్నాపర్లు బంధించడం గమనార్హం. అటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, బంధువులు పోలీసులను కంగారు పెట్టించిన ఈ ఘటన చివరకు సుఖాంతంగా ముగిసింది. బాలుడిని కాపాడేందుకు పోలీసులకు, దుండగలకు మధ్య యాక్షన్ సినిమా లెవల్లో  పోరు నడిచింది.  

యుద్ధ వాతావరణాన్ని తలపించేలా  స్కూలు ఆవరణ కాల్పులతో దద్దరిల్లిపోయింది.  హైడ్రామా  అనంతరం ఎట్టకేలకు  కిడ్నాపర్ల చెర నుండి  బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్వల్పంగా కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: