ఒకప్పుడు ప్రజలను, నాయకులనూ అనుసంధానించేవి పత్రికలు మాత్రమే. ఇప్పుడు ఆ విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా.. ఆ తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు హాట్ హాట్ గా సేవలందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాకైనా కొన్ని పరిమితులు, ఇబ్బందులు ఉన్నాయి కానీ.. సోషల్ మీడియాలో అలాంటి ఇబ్బందులే లేవు. అంతే కాదు పైసా ఖర్చు లేకుండా విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియానే సులభమైన మార్గం.

సోషల్ మీడియాను తెలుగు రాజకీయాలకు మొదటగా పరిచయం చేసిన వ్యక్తిగా లోకేశ్ , చంద్రబాబులకు పేరుంది. మొదట్లో లోకేశ్ ట్వీట్లతో తప్ప మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టేవాడు కాదు. ఇప్పుడు అదే సోషల్ మీడియా దన్నుగా వైసీపీపై సమరం కొనసాగిస్తున్నారు. లేటెస్టుగా.. మహాకవి గురజాడ శతవర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ ఫేస్ బుక్ టీమ్ చేసిన తప్పును లోకేశ్ ఎండగట్టారు. 

గురజాడ వర్థంతి అయితే వైసీపీ టీమ్ కందుకూరి ఫోటో పెట్టారు. ఆ తర్వాత తప్పు గుర్తించి ఫోటో మార్చారు. ఈ గ్యాప్ లోనే లోకేశ్ రెచ్చిపోయారు. గురజాడ, కందుకూరికి తేడా తెలియదా అంటూ విమర్శల వర్షం కురిపించేశారు. దీన్ని టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు. దీంతో డిఫెన్సలో పడిన వైసీపీ టీమ్ టీడీపీ పాత తప్పులను వెలికి తీసింది. 

గతంలో చంద్రబాబు గురజాడ కొటేషన్‌తో ట్వీట్‌ చేస్తూ దేశమంటే మట్టి కాదోయ్ అని పెట్టబోయి మట్టి కదోయ్‌ అంటూ చేసిన ట్వీట్‌ ను వైసీపీ టీమ్ రీ ట్వీట్ చేసింది. అంతేకాదు.. లోకేష్‌ ఒక సభలో పొరపాటున.. బంధుప్రీతి, మతపిచ్చి, కుల పిచ్చి… ఎక్కువగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే.. అంటూ చేసిన ప్రసంగం వీడియాను పోస్టు చేశారు. ఇలా ఒకరి తప్పులు మరొకరు ఎంచుకుంటూ సోషల్ మీడియా వార్ సాగిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: