ప్రపంచంలో ఇప్పుడు జనాలకు బ్యాంకుల్లో ఖాతాలు లేక పోవచ్చు కాని ఫేస్ బుక్ లో మాత్రం ఖచ్చితంగా ఖాతా ఉంటుంది. అంతగా  ఆదరణ పొందిన  ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ సంచలన నిర్ణయం తిసుకున్నారు. మానవతా విలువలు చాటుకోబోతున్నాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్  తన ముద్దుల కూతురు కోసం  రెండు నెలల లీవ్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.


ఈ విషయాన్ని  ఆయన  సోషల్ మీడియాలో వెల్లడించారు.   దీంతోపాటు తన ఫేస్బుక్ పేజీలో పాప ఫోటోను కూడా  షేర్ చేశాడు. తన కూతురు పుట్టిన సంధర్బంగా తమకున్న షేర్లలో 99 శాతాన్ని దానం చేసేయాలని నిర్ణయించారు.  అంటే దాని విలులువ సుమారు 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా..ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ‘చాన్ జుకెర్ బర్గ్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ యువ దంపతులు నిర్ణయించారు. ఇక సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. ఆదాయం 11.3 శాతం పెరిగిందని ఫేస్ బుక్ ప్రకటించింది. 4.5 బిలియన్ డాలర్ల రాబడి ఆర్జించినట్టు తెలిపింది.

ఫేస్ బుక్ కార్యాలయం


అంతకుముందు త్రైమాసికంలో రాబడి 4.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది. యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయమైన పెరగడంతో రాబడి పెరిగిందని ఆ మద్య వార్తలు వచ్చాయి. తన కూతురైన ‘ మ్యాక్స్ ’ పేరిట లేఖ రాసిన జుకెర్ బర్గ్ దానిని తన ఫెస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు ఈ దానం చేస్తున్నానన్నాడు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరి కోసం ఈ చిన్న సాయం చేస్తున్నట్లు తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: