తమిళనాడులో వర్షం మళ్లీ బీభత్సం సృష్టించింది. తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు పట్టణాలలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు శతబ్దాం నాటి రికార్డులను తిరగరాసి ప్రజలను ఇక్కట్లుకు గురి చేసింది.చెన్నై నగరంలో 1918లో రికార్డు వర్షపాతం నమోదైంది. అప్పట్లో నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు వందేళ్ల దాకా నాటి రికార్డ్ వర్షపాతం నమోదు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షం మాత్రం వందేళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది.


సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. మంగళవారం కూడా ఎడతెరిపి లేని వర్షం చెన్నైని ముంచెత్తింది. వాస్తవానికి సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నెల రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు తల్లడిల్లిపో తున్నాయి. వరుస అల్పపీడనాల కారణంగా గత నెల రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో తేరుకోలేని నష్టాన్ని భరిస్తున్న తమిళులపై ప్రకృతి ప్రకోపం ఇంకా చల్లారలేదు.

చెన్నైలో కష్టాలు పడుతున్న ప్రజలు


తాజాగా మరోసారి వరుణుడు తమిళనాడుపై విరుచుకుపడ్డాడు.ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాని మోడీ ఫోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. వర్ష బీభత్సంపై ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: