రాష్ట్రంలో చీకటి రోజులు మొదలయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోవటంతో పగటి పూట కొన్ని గంటలు, సాయంత్రంపూట, కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఇందనం శాఖ ప్రకటించాయి. ఇక హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్, నగరాల్లో రోజుకు మూడు గంటలు ఉదయం సాయంత్రం కలిపి జిల్లా కేంద్రాలు, కొర్పోరేషన్లలో ఉదయం రెండున్నర గంటలు, సాయంత్రం రెండున్నర గంటలు కలిపి ఐదు గంటలు, టౌన్లలో, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో ఆరు గంటలు, పల్లె ప్రాంతాలలో పగటి పూట వ్యవసాయానికి సరఫరా చేసి, సాయంత్రం 6 గంటలు నుంచి మరుసటీ రోజు ఉదయం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించినట్లు ఇంధనం శాఖ వెల్లడించింది.  ఇక పరిశ్రమల విషయానికొస్తే లఘ పరిశ్రమలు తప్ప అన్ని పరిశ్రమలకు వారంలో మూడు రోజుల విద్యుత్ సెలవు లేదా ఒక నెలలో 12 రోజుల సెలవును విధించి ఫీక్ ఆంక్షలు సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఆంక్షలు విధించనున్నారు. ఇవి కాకుండా పౌల్ట్రీ, రైసుమిల్లులు, కోల్ట్ స్టోరేజ్లకు 40 శాతం కోత విధిస్తూ (60శాతం) సాయంత్రం ఫీక్ సమయాల్లో 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సరఫరాపై ఆంక్షలు విధించటమైనది. వ్యవసాయ రంగానికి మాత్రం ఖచ్చితంగా ఏడు గంటలపాటు సరఫరా చేయాలన్న నిర్ణయం వల్ల ఈ రంగానికి ఎలాంటి రిలీఫ్ ను ప్రకటించలేదు. ఇటు థర్మల్ జలవిద్యుత్తు తోపాటు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులలో కూడా గ్యాస్ కొరత ఉత్పత్తి భారీగా పడిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర విద్యత్ సంక్షోభం ఏర్పడిన ధృష్ట్యా సరఫరాపై ఆంక్షలు విధిచడం అనివార్యమైందని ఇందనం శాఖ స్పష్టం చేసింది.  ఇంధనం శాఖ ముఖ్యకార్యదర్శి దినేష్ కుమార్ తాజా విద్యతు పరిస్థితిపై ట్రాన్స్కో సిఎండి హీరాలాల్ సమారియాకు బుధవారం లేఖ రాసారు. వ్యవసాయ రంగానికి రెండు దఫాలుగా ఖచ్చితంగా రోజుకు 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని లేఖలో స్పష్టం చేశారు. దాంతో ట్రాన్స్కో, డిస్కంలు, సిడిఎంలు, జెఎండిలు ఉన్నతస్థాయి సమావేశమై పరిస్థితిని సమీక్షించి విద్యుత్ సరఫరా చేయాలని ఆలేఖలో నిర్ణయం చేశారు.  అయితే ఈ ఆంక్షలు నుంచి సింగరేణి, త్రాగునీటి, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వె ట్రాక్షన్, రక్షణ రంగాలకు మినహాయింపునిచ్చారు. ప్రభుత్వం, డిస్కంలు పెరిగిన డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సుమారు 255 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడిందని ఇంథనం శాఖ వివరించిందని ఇంథనం శాఖ వివరించింది. తీవ్ర వర్షభావ పరిస్థితులు, సహజవాయువు, బొగ్గు, జలవిద్యుత్ వంటి ఇంధనం కొరత వల్ల తప్పని 

మరింత సమాచారం తెలుసుకోండి: