తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దగ్గరలో ఉందని, స్పష్టమైన సంకేతాలున్నాయని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో టిబీజీకెఎస్ గెలుపొందడంతో తెలంగాణ వాదం గెలిచినట్లైయిందని కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  గెలిపించిన సింగరేణి కార్మికులను మరిచి పోవద్దని కార్మిక నాయకులకు సూచించారు. సింగరేణి డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో ప్రభుత్వం చేపట్టే పనుల బాధ్యతను తాను తీసుకుంటానని, సకలజనుల సమ్మెకారణంగా నిలిపి వేసిన రెండు నెలల జీతం డబ్బులను మిత్తితో చెల్లిస్తామని, ఆదాయపన్ను మినహయింపు వచ్చేలా క్రుషిచేస్తానని తెలిపారు.  టిఆర్ఎస్ హిమాలయాలంతా ఎత్తుకు ఎదిగిందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరిన్ని బొగ్గు బావులను త్రవ్వించి 40వేల మందికి అవకాశం కల్పించి కార్మికుల సంఖ్యను పెంచుకుందామని కార్మిక నాయకులకు భరొసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: