పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం చల్లారక ముందే.. మరో విగ్రహ ప్రతిపాదన తెరపైకి వస్తోంది. పార్లమెంట్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టంచడానికి అనుమతి ఇవ్వాలంటూ మాజీ కేంద్ర మంత్రి, సినీనటుడు కృష్ణం రాజు.. స్పీకర్ మీరా కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖడిగా నిలిచిన అల్లూరి విగ్రహం.. పార్లమెంట్ లో పెట్టడం తన కర్తవ్యమని కృష్ణంరాజు అన్నారు. అవసరమైతే విగ్రహాన్ని తానే ఏర్పాటు చేస్తానని తెలిపారు. కృష్ణంరాజు వెంట మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. మొత్తానికి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ, కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన విభేదాల కారణంగా విగ్రహం ఏర్పాటు జాప్యమవుతూ వస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ లో ఇక కొత్తగా ఎవరి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణంరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేయాలంటూ స్పీకర్ మీరా కుమార్ ను కలవడం వెనుక ఎవరున్నారు? లేక ఆయన నిజంగానే తనంతట తానే ఈ ప్రతిపాదన తెచ్చారా అన్నది ఇప్పుడు టీడీపీ నేతల్లో చర్చనీయాంశమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: