అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతిస్తున్నట్లు మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సచివాలయంలో గురువారం ప్రజాహితం కార్యక్రమంలో ఆయన విద్యాశాఖ పనితీరుపై అధికారుల సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పదొన్నతులు, బదిలీలు, హేతుబద్దీకరణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సబ్జెక్టు టీచర్ల కొరత ఉండదని, గుర్తింపు లేని ప్రైవేటు విద్యాలయాలను మూసివేయాలని ఆదేశించామని చెప్పారు. ఆయా పాఠశాలలో సౌకర్యాలు లేమి వాస్తవమని, వీటి మెరుగైకై రూ.2200 కోట్లు వెచ్చిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యాలయాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని రెండేళ్లలో 62వేల టీచర్లను నియమించామని, ఈ ఏడాది 22వేల టీచర్లను నియమిస్తామని ఖాళీలు ఏర్పడినప్పుడు భర్తీ చేస్తామని వివరించారు. మధ్యాహ్ప భోజనం ఏర్పాటులో సమస్యల పరిష్కారానికి గాను చర్యలు చేపట్టామని తెలిపారు. విప్రో, మైక్రోసాప్ట్ వంటి కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వ విద్యాలయాలలో మెరుగైన కంఫ్యూటర్ విద్యను అందిస్తామన్నారు. నాబార్డు, తదితర సంస్థల నుంచి రూ.100 కోట్ల రుణంతో కళాశాలలు మెరుగైనన సౌకర్యాలు కల్పిస్తామని, వృత్తివిద్యా కోర్సులు పటిష్టం చేస్తామని వివరించారు. మూడు ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు కార్పోరేట్ విద్యాలయాలకు ధీటుగా ఫలితాలు సాధిస్తామని, ఉద్యోగావకాలు పెంపుదలకు ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని చెప్పారు. మోడల్ స్కూల్స్ పటిష్టం చేసేందుకు గాను బాలికల హాస్టల్స్ సౌకర్యాల కోసం రూ.1.30 కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే ఏడాది టెట్, డిఎస్సీ కలిపి ఒకే పరీక్ష ఉండెలా చర్యలు తీసుకుంటున్నామని స్ఫష్టం చేశారు. ఒకే స్కూల్లో ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. విద్యాలయాల్లో తగిన కంఫ్యూర్లు, ల్యాబరేటరీ, సౌకర్యాల ఏర్పాటుకు కావలసిన నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. అధిక ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాలయాలై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు విభజన ఆలోచన లేదని, పర్మినెంట్, కాంట్రాక్టు లెక్చరర్లు ఖాళీలు లేవని, 1100 మంది లెక్చరర్లను ఏపీపీఎస్సీ నియమిస్తోందని వివరించారు. కాంట్రాక్టు లెక్చరర్లు కొనసాగింపు లేదా కొత్త వారిని పర్మినెంట్ నియామకంపై సబ్ కమిటీ సూచనలు పాటిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: