మరోసారి డీజిల్ ధరలు పెరుగనున్నాయి. పెరుగనున్న డీజిల్ ధరలతో అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం పడనుంది. డీజిల్ ధరలు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పెంచనున్నట్లు తెలుస్తుంది. డీజిల్ ధరలు పెంచడం అనివార్యంగా కేంద్రప్రభుత్వం బావిస్తున్నట్లు తెలుస్తుంది. సంవత్సర కాలంగా డీజిల్ ధరలు పెంచక పోవడంతో ప్రస్థుత పరిస్థితిలో తప్పదని తెలుస్తుంది. డీజిల్ ధరలు పెరిగితే బస్సు చార్జీలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతే కాకుండా రైతులపై ఆర్థిక భారం మరింత పడుతుంది. ట్రాక్టర్లపై ఆదారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు డీజిల్ ధర పెరిగితే దున్నకం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.  దీంతో పాటు వ్యవసాయ పనులకు డీజిల్ యంత్రాలు అవసరపడుతుండగా పెరిగిన డీజిల్ ధరలతో వ్యవసాయ యంత్రాల కిరాయిలు మరింత పెరుగనున్నాయి. దీంతో పాటు ప్రైవేట్ వాహనాల టాక్సీలు మరింత పెరిగే అవకాలున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: