ఆంధ్రా మహిళాఎమ్మెల్యేలు రోజా- అనిత మధ్య వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాయకరావు పేటకు చెందిన అనిత గురించి నిండు అసెంబ్లీలో అసభ్యంగా అభ్యంతర కరంగా మాట్లాడిందన్న ఆరోపణలపై రోజాపై గత అసెంబ్లీ సెషన్స్ లో సస్పెన్షవ్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇష్యూపై చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఈ జంట వార్తల్లోకి వచ్చింది. 

ఇప్పుడు మేటర్ ఏంటంటే.. తనపట్ల తోటి ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించినందువల్ల రోజాపై  సస్పెన్ష్న్ వేటు వేయాలని అనిత కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆ ఇష్యూపై రోజాను వివరణ అడిగింది. రోజా వివరణ చెప్పేందుకు ఇంకా సమయం ఉంది. ఈ లోపు ఎమ్మెల్యే అనిత మరోసారి రోజాపై మండిపడ్డారు. తన పరువుకు కోటి రూపాయల నష్టం వాటిల్లందంటూ పరువు నష్టం దావా వేశారు.

ఈ పరువు నష్టం దావాను రోజా చాలా లైట్ గా తీసుకున్నారు. ఆమె గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులను కలుసుకుని చిత్తూరు జిల్లాలోని రైల్వే సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో కొన్ని తమాషా కబుర్లు చెప్పారు. వైసీపీలో ప్రభుత్వ అక్రమాలను బలంగా వినిపిస్తున్న గళం కావడం వల్లే తనను తొక్కేయాలని చూస్తున్నారని వాపోతోంది.

అనిత దళిత సభ్యురాలు కాబట్టే.. ఆమెతో తనపై ఆరోపణలు చేయించి, కేసులు పెట్టించి.. రాజకీయ పావుగా వాడుకుంటున్నారని రోజా ఆరోపిస్తోంది. తనపై దాడి కోసం అనిత పాపం బలిపశువు అవుతోందంటూ బాధఫడిపోయింది రోజా. శాసనసభలో తన ప్రవర్తనకు తానేమాత్రం విచారించడం లేదని రోజా  చెప్పారు. ఇప్పటికైనా సారీ చెబుతారా అని రోజాను అడిగితే నో.. నెవ్వర్ అంటూ చకచకా వెళ్లిపోయారు రోజా. 



మరింత సమాచారం తెలుసుకోండి: