ప్రజారాజ్యం పార్టీ స్టాపింగ్ రాజకీయాల్లో మొదటి అట్టర్ ఫ్లాప్ చవిచూసిన మెగాస్టార్ అదే పాలిటిక్స్ లో హిట్ కొ్టాలని భావిస్తున్నారా.. ప్రస్తుతానికి కాలం కలసి రాకపోయినా ఫ్యూచర్ లోనైనా మంచి పొజిషన్ చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్నారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజారాజ్యం వర్కవుట్ కాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరిన మెగాస్టార్ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా..?

మెగాస్టార్ క్రమంగా బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్టు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇందుకు అనేక అంశాలను వారు సంకేతాలుగా చూపుతున్నారు. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో ఉపాధిహామీ పథకం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా రాహుల్ గాంధీతో బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రముఖులంతా హాజరయ్యారు. 

రాష్ట్రంలోని వారే కాదు పక్క రాష్ట్రం సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అది ఉపాధిహామీ పదేళ్ల సభా లేక కాంగ్రెస్ పార్టీ పొలిట్ బ్యూరో మీటింగా అన్నంతగా నేతలు తరలివచ్చారు. ఇందరు వచ్చినా మన మెగాస్టార్ ఆచూకీ మాత్రం అక్కడ కనిపించలేదు. అక్కడే కాదు.. ఆయన ఇటీవల కాంగ్రెస్ కార్యక్రమాలవైపు అంతగా చూడటం లేదు. పట్టించుకోవడం లేదు. 

ఏపీలో తెలుగుదేశం పార్టీకీ, బీజేపీకీ సంబంధాలు అంత బాగా లేని సమయంలో బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని మెగాస్టార్ ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి ఓ స్టార్ పొలిటిషియన్ అవసరం ఉంది. ఆ స్థానాన్ని తాను భర్తీ చేస్తే ఫ్యూచర్ బావుంటుందన్న ఆలోచన ఉందట.

లాగూ తమ్ముడు పవన్ కల్యాణ్ మోడీకే జై అంటున్నారు. తాను కూడా కమల దళంలో చేరితే బెటరని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఏపీలో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ బాగుపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా ఆ శిథిల హస్తాన్నే నమ్ముకోవడం కంటే పద్మదళ పయనం బెటరన్నది  మెగాస్టార్ ఆలోచనగా చెబుతున్నారు. మరి ఇది సాకారం అయ్యేందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: