ఆయనో టీడీపీ ఎమ్మెల్యే.. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే గెలిచాడు.. అందులోనూ ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం అదే ఫస్ట్ టైమ్. అయినా అనూహ్యంగా విజయం సాధించాడు. ఎమ్మెల్యే అయ్యాడు.. అలాంటి వాడు అధినేతకు ఎంత విధేయుడుగా ఉండాలి.. కానీ ఆయన రూటే సెపరేటు.. ఆయనకు అధినేత మాట అంతగా పట్టదు. అధినేతే కాదు.. అసలు పార్టీ వ్యవహారమే ఆయనకు నచ్చదు. 

పోనీ అలాగని వేరే పార్టీలోకి జంప్ చేస్తాడా.. అదీ లేదు. అసలు ఆయనకు ఈ పార్టీలు, రాజకీయాలు అంటే అస్సలు గిట్టవు. మరి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసినట్టు.. ఎమ్మెల్యే ఎందుకు అయినట్టు.. ఈ ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర దిమ్మతిరిగే సమాధానం ఉంది. టీడీపీ తెలంగాణ అధికారంలోకి వచ్చే సీన్ ఉంటే.. సీఎం కుర్చీ ఆయనకే ఇస్తానని చెప్పారు అధినేత చంద్రబాబు. 

ఏదో సీఎం కుర్చీ ఇస్తానంటున్నారు కదా అని వచ్చి పార్టీలో చేరాను తప్ప.. ఈ రాజకీయాలు మన ఒంటికి సరిపడవు అంటున్నారాయన. ఇదేదో భలే టిపికల్ క్యారెక్టర్ లా ఉందే అనుకుంటున్నారు కదా. అవును ఆయన చాలా టిపికల్. ఆయనే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య. ఆయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదేమో. 

బీసీల హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్నారాయన. ఆయన బ్యాక్ గ్రౌండ్ చూసి.. బీసీల ఓట్లు పడతాయన్న ఆశతో చంద్రబాబు గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా ఆయన్ను తెరపైకి తెచ్చారు. ఆయన కూడా ఏమో తన రాత ఎలా రాసిపెట్టి ఉందో.. గెలిస్తే ఏకంగా సీఎం అయిపోవచ్చు కదా.. అని భావించినట్టున్నారు. తీరా ఆ ఆశ నెరవేరలేదు. 

ఇప్పుడు అదే ఆర్ కృష్ణయ్య కాపులకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ప్రభావితం అయ్యేలా కాపులకు రిజర్వేషన్ ఇస్తే మొత్తం ఏపీని స్తంభింపజేస్తామంటున్నారు. ఏపీ మొత్తం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చారు. బాబు చెప్పినా సరే.. నాకు బీసీల సంక్షేమం తర్వాతే ఏదైనా అంటూ మొండికేస్తున్నారు. ఆయనకు ఎలా సర్థిచెప్పాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు చంద్రబాబు. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: