హైదరాబాద్ పాతబస్తీ అంటే మజ్లిస్ ఆధిపత్యం భీకరంగా ఉండే ప్రాంతం ఇది. ఎంతటి మంత్రులైనా మజ్లిస్ పర్మిషన్ ఉంటేనే కానీ పాత బస్తీ లలో కొన్ని ప్రాంతాల్లో తమంతట తాము వెళ్ళలేరు అంతగా ఆ ప్రాంతం మీద మజ్లిస్ గ్రిప్ తెచ్చేసుకుంది. ఎప్పటి నుంచో జరుగుతున్నా తంతే అయినా అందరికీ తెలిసిందే అయినా కొన్ని ఘటనలు మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి.

 

 

ఏ పార్టీ అధికారం లో ఉంది అనే లెక్క లేకుండా మజ్లిస్ వారితో అధికారిక లేక అనధికారిక పొత్తులో ఉంటుంది. మజ్లిస్ దెబ్బ రుచి చూసిన రాజకీయ నాయకులని అడిగితే వారి లెక్కల రుచి చెబుతారు. మొన్న షబ్బీర్ అలీ కి జరిగిన పరాభవం చూసిన తరవాత ఆయనే స్వయంగా ' మజ్లిస్ పాము లాంటిది ' అంటూ వ్యాఖ్యలు చెయ్యడం శోచనీయం. " మేము ఇన్నాళ్ళూ , ఏళ్ళకు ఏళ్ళ నుంచి పాలు పోసి పెంచిన పాము తిరిగి మమ్మల్నే కాటేస్తుంది అని ఊహించలేదు " అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

 

 

కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న కాలం లో కాంగ్రెస్ ప్రభుత్వానికీ - మజ్లిస్ పెద్దలకీ మధ్యన రాయభారం నడిపింది ఆయనే. అయితే ఇక్కడ తెరాస పాత్ర చర్చనీయాంశం అయ్యింది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరొక నాయకుడి మీద దాడి చేస్తే ఖచ్చితంగా తెరాస లాంటి అధికార పార్టీ సైలెంట్ గా ఉండకూడదు. కనీసం గట్టిగా స్పందించి ఖండించి తీరాలి.

 

 

కానీ తెలంగాణా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్సు వారు ఆ టైం లో అక్కడకి వెళ్ళడం ఎందుకు , ఎవరు వెళ్ళమన్నారు అంటూ రివర్స్ లో అడగడం తెరాస చేతకాని తనానికి నిదర్సనం గా కనిపిస్తోంది. నిజాలు తెలిసిన తరవాత మజ్లిస్ - కాంగ్రెస్ ల మధ్య విషయాలు బయట పడతాయి అనీ అప్పుడు మాట్లాడదాం అనీ అంటున్నారు కేటీఆర్. మేయర్ పదవి కోసం మజ్లిస్ కి తెరాస గులాం అవుతోంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: