దశాబ్దాల క్రితం సినిమాల్లో మనుషులకు ఎంత ప్రయారిటీ ఉండేదో జంతువులకు కూడా అంతే ప్రయారిటీ ఉండేది. రామనారాయణ వంటి దర్శకులు కేవలం జంతువులే హీరోలుగా అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. కుటుంబ సభ్యుల్లా మసలుకునే ఎద్దులు.. హీరో స్నేహితుడిగా ఉండే కోతి, నమ్మిన బంటుగా ఉండే కుక్క, దేవతా స్వరూపంగా పాము.. ఇలా జంతువులన్నీ తెరపై సందడి చేసేవి.

అయితే తెరపై మనకు చూడటానికి బాగానే ఉంటుంది కానీ.. ఆ స్థాయి వినోదం పండాలంటే ఆ జంతువులను హింసించాల్సిందేనట. వాటి సహజ సిద్ధ జీవనానికి వ్యతిరేకంగా వాటిని వేధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టానికి వ్యతిరేకం. జంతువుల హక్కుల కోసం పోరాడే సంస్థల పోరాటం తర్వాత ఇప్పుడు సినిమాల్లో జంతువుల వినియోగం బాగా తగ్గిపోయింది. 

అంతేకాదు ప్రతి సినిమా టైటిల్స్ లో ఈ సినిమాలో మేం జంతువులను వాడలేదు. ఆ సన్నివేశాలు గ్రాఫిక్స్ చేశాం అని ముందే వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు బాహుబలి దర్శకుడు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాహుబలి సెకండ్ పార్ట్ కోసం ఆయన ఓ ఏనుగును వాడారట. ఇలా ఏనుగును వాడేందుకు ఆయన ఎలాంటి అనుమతులు తీసుకోలేదట.

ఈ విషయంపై యానిమల‌్ టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వెంకటాచలం ఆగ్రహంగా ఉన్నారట. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టానికి వ్యతిరేకమేనంటున్న ఆయన ఈ విషయంపై ఏకంగా ప్రధానమంత్రికే నివేదిక పంపారట. సినిమా నిర్మాత, దర్శకులను అరెస్టు చేయాలని అందులో కోరారట. ఈ సినిమా ప్రతినిధులు మాత్రం తాము ఏనుగును హింసించలేదని.. కేవలం గ్రాఫిక్స్ రూపొందించేందుకు మాత్రమే తెచ్చామని అంటున్నారు. చివరకు ఏమవుతుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: